శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Mar 01, 2020 , 04:30:42

భద్రంగా రోడ్డు దాటేలా..

భద్రంగా రోడ్డు దాటేలా..
  • రూ. 239 కోట్ల వ్యయంతో నిర్మాణం
  • అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం

వాహనాలతో రద్దీగా ఉండే రహదారులను.. పాదచారులు భద్రంగా దాటేందుకు 38 వంతెనలు..8 స్కైవేలను నిర్మించనున్నారు. వీటికి రూ. 239.55 కోట్ల అంచనాలతో ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.  రోడ్డు దాటుతున్న సందర్భంలోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని  గణాంకాలు తెలుపుతున్నాయి. వీటి నివారణకు జీహెచ్‌ఎంసీ వంతెనల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది.


సిటీబ్యూరో,  నమస్తే తెలంగాణ: రద్దీ ప్రాంతాల్లో పాదచారుల కష్టాలు తీరనున్నాయి. ఇక భద్రంగా రోడ్డు దాటేయవచ్చు. నగరంలోని రద్దీ ఉన్న చోట 38 పాదచారుల వంతెనలు(ఎఫ్‌వోబీ), ఎనిమిది స్కైవేలు నిర్మించనున్నారు. ఇందుకు రూ. 239.55 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 52 పాదచారుల వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, ఇందులో 38కి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు, కొన్ని అంతకన్నా ముందే పూర్తవుతాయని అధికారులు తెలిపారు. 


స్కైవేలు..

 1 ప్యాకేజీ-లో భాగంగా ఎల్‌బీనగర్‌ జోన్‌లో ఒకటి, ప్యాకేజీ-2లో చార్మినార్‌ జోన్‌లో ఒకటి, ప్యాకేజీ-3లో భాగంగా  ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్లలో నాలుగు, ప్యాకేజీ-4లో భాగంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో రెండు స్కైవేలు కలిపి మొత్తం ఎనిమిది స్కైవేలు నిర్మించనున్నారు.  ఇందులో రూ. 12.96 కోట్లతో ఉప్పల్‌ రింగురోడ్డులో ఒకటి, రూ. 27.1కోట్లతో లక్డీకాపూల్‌, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం-12, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, చిలకలగూడ రింగురోడ్డు (ఎస్కలేటర్‌తో), రూ. 11.9కోట్లతో ఆరాంఘర్‌, రూ. 18.2కోట్లతో సుచిత్ర జంక్షన్‌(ఎస్కలేటర్‌తో)లో ఒకటి, బోయిన్‌పల్లిలో(రెండు ఎస్కలేటర్‌తో) మరో స్కైవే నిర్మించనున్నారు. 


ఎఫ్‌వోబీలు నిర్మించే ప్రాంతాలు...

ప్రాంతం                                                             వ్యయం(లక్షల్లో)

ఎల్‌బీనగర్‌ జోన్‌(ప్యాకేజీ-1)...

చక్రీపురం క్రాస్‌రోడ్స్‌, నాగారం విలేజ్‌                     360

హెచ్‌పీఎస్‌, రామాంతాపూర్‌                                     260

నోమా ఫంక్షన్‌ హాల్‌, మల్లాపూర్‌                             370

సాయిసుధీర్‌ కాలేజీ, ఏఎస్‌రావునగర్‌                     270

ఎస్‌బీఐ, హబ్సిగూడ                                             275

సుష్మా థియేటర్‌, వనస్థలిపురం                              395

దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌                                             395

కొత్తపేట్‌ ఫ్రూట్‌ మార్కెట్‌                                     395

సరూర్‌నగర్‌ స్టేడియం                                             395

వర్డ్‌ అండ్‌ డీడ్‌ స్కూల్‌, హయాత్‌నగర్‌                     395


చార్మినార్‌ జోన్‌(ప్యాకేజీ-2)

స్వప్న థియేటర్‌, రాజేంద్రనగర్‌                             250

షాహ థియేటర్‌, గణేశ్‌నగర్‌                                     250

బండ్లగూడ సన్‌సిటీ(ఎస్కలేటర్‌తో)                     370

సీబీఎస్‌ టూ ఎంజీబీఎస్‌ (ఎస్కలేటర్‌తో)             370

దుర్గానగర్‌ టీ జంక్షన్‌ హెరిటేజ్‌ పారియర్‌(,,)     385

ఓల్డ్‌ కర్నూల్‌ టీ జంక్షన్‌, ఉందానగర్‌(,,)             395

ఓమర్‌ హాస్పిటల్‌, షాలిమార్‌ హోటల్‌                     270


ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్‌లు(ప్యాకేజీ-3)

ఆరె మైసమ్మ టెంపుల్‌, లంగర్‌హౌస్‌(ఎస్కలేటర్‌తో)          375

షేక్‌పేట్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌, గెలాక్సీ                                    275

జీవీకే వన్‌, రోడ్‌ నం-1, బంజారాహిల్స్‌(ఎస్కలేటర్‌తో)  385

హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్‌, పంజాగుట్ట(ఎస్కలేటర్‌తో)  395

హిమాయత్‌నగర్‌ క్రాస్‌రోడ్‌-నారాయణగూడ ఫ్లైఓవర్‌      260

నేరేడ్‌మెట్‌ బస్టాప్‌                                                                  260

గాంధీ వైద్యశాల, ముషీరాబాద్‌(ఎస్కలేటర్‌తో)                 370

సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌, తార్నాక 260

సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌, సికింద్రాబాద్‌(ఎస్కలేటర్‌తో)  385


కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్‌లు(ప్యాకేజీ-4)

బాలానగర్‌, ఎన్‌ఎస్‌కేకే స్కూల్‌                                 250

రంగభుజంగ థియేటర్‌, షాపూర్‌నగర్‌(ఎస్కలేటర్‌తో)  370

ఈఎస్‌ఐ, మారుతీ సుజుకీ, ఎర్రగడ్డ(ఎస్కలేటర్‌తో)  385

శాంతా మేరీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ఆదర్శ్‌నగర్‌        250

ఐడీబీఐ, గచ్చిబౌలి                                                 260

భాను టౌన్‌షిప్‌, మియాపూర్‌                                         260

సైబర్‌ గేట్‌వే, హైటెక్‌సిటీ(ఎస్కలేటర్‌తో)                 375

టెలికాంనగర్‌, గచ్చిబౌలి(ఎస్కలేటర్‌తో)                 375

చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌, మదీనగూడ(ఎస్కలేటర్‌తో)   385

విజేత సూపర్‌ మార్కెట్‌, చందానగర్‌(ఎస్క్‌లేటర్‌తో)    385

ఆల్విన్‌ క్రాస్‌రోడ్స్‌, మియాపూర్‌(ఎస్కలేటర్‌తో)          385

ఇందిరానగర్‌, గచ్చిబౌలి                                                290


logo