శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medchal - Feb 23, 2020 , 00:09:21

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

క్రీడాకారులకు  ప్రభుత్వ ప్రోత్సాహం

కంటోన్మెంట్‌/సికింద్రాబాద్‌, నమస్తేతెలంగాణ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే క్రీడాకారులకు సరైన చేయూత లభిస్తుందని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్‌ ప్రాంతానికి చెందిన నేత ముప్పిడి గోపాల్‌ వివిధ క్రీడా సంస్థల సమన్వయంతో సికింద్రాబాద్‌లోని జింఖాన మైదానంలో సీఎం హాకీ కప్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ ముగింపు సభ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందించారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాం తాల నుంచి 30 టీమ్‌లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ హాకీ క్రీడకు చిరకాలంగా ప్రాముఖ్యత ఉందని, ఈ క్రీడలో నైపుణ్యం సాధించేవారిని తమవంతు ప్రోత్సహిస్తామని తెలిపారు. అంతకు ముందు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు హాకీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలోలో తీగుళ్ల త్రినేత్రగౌడ్‌ పాల్గొన్నారు. 


logo