గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Feb 22, 2020 , 03:15:49

పట్టణ ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ

పట్టణ ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ

(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ):రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ప్రత్యేక కార్యాచరణతో గ్రామాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. పారిశుద్ధ్యం సమస్య కొంతవరకు పరిష్కారమ య్యాయి. అదే స్ఫూ ర్తితో రాష్ట్ర ప్రభుత్వం ‘పట్టణ ప్రగతి’కి శ్రీకారం చుట్టింది. ఈనెల 24నుంచి మార్చి 4వరకు పదిరోజులపాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. ‘పట్టణ ప్రగతి’ని విజయవంతం చేయడానికి రెండురోజుల క్రితం మంత్రి సబితారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు మేయర్లు కమిషనర్లకు శంషాబాద్‌ లో సన్నాహక సమావేశం నిర్వహించి సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం.. లక్ష్యాలను మరోసారి పునరుద్ఘటించారు. రాష్ర్టానికి సంవత్సరానికి రూ.811కోట్లు కేటాయిస్తే ఇందులో రూ.311కోట్లు జీహెచ్‌ఎంసీకి పోతే మిగిలిన రూ.500 కోట్లు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు కేటాయింపులు చేస్తారు. ఈ లెక్కన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రూ.133కోట్లు రాష్ట్రప్రభుత్వం నేరుగా మంజూరు చేస్తుంది. ఈ నిధులతోపాటు ఆయా మున్సిపాలిటీల వారీగా రూపొందించే బడ్జెట్‌తో కలుపుకుంటే ఉమ్మడి జిల్లాకు రూ.450 కోట్లు అవుతుందని ‘పట్టణ ప్రగతి గణాంకాలు’ వెల్లడిస్తున్నది.

మార్గదర్శకాలు విడుదల ...

ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాలో మూడు కార్పొరేషన్లు, 12మున్సిపాలిటీల పరిధిలో 351వార్డులు ఉన్నా యి. వీటి పరిధిలో 20లక్షాలకు పైగా జనాభా ఉంటుంది. అదే స్థాయిలో నివాసాలు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం అమ లు చేస్తున్న ‘పట్టణ ప్రగతి’లో అధికారు లు, ప్రజాప్రతినిధులను, స్వచ్ఛందసంస్థ ల సభ్యులను, కాలనీలోని యువజన సంఘాలసభ్యులను భాగస్వాములు చేస్తారు. వీరు పది రోజులపాటు అధికారులతో కలిసి సమన్వయంగా పని చేస్తూ మురుగుకాల్వలు శుభ్రం చేయిస్తూ.. కాల్వల వద్ద పిచ్చిమొక్కలను తొలిగిస్తా రు. విద్యుత్‌శాఖ సిబ్బందితో కలిసి పట్టణాల్లోని వివిధ వార్డుల్లో వేలాడుతున్న తీగలు సరిచేస్తారు. పట్టణ శివారులో డంపింగ్‌యార్డుల నిర్మాణాలకు స్థలాలు గుర్తిస్తారు. వీటితో శ్మశానవాటికలో వివిధ రకాల పనులు చేపడతారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా చిన్న చిన్న వ్యాపారాలతో ఉపాధి పొందుతున్న వీధి వ్యాపారులను గుర్తించి వారికి ప్రత్యేక జోన్‌లు ఏర్పాటుచేస్తారు. ఈ పనులు చేపట్టడానికి ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక నిధులు విడుదల చేయనుంది. రాబో యే ఆరునెలాల్లో పట్టణాల రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులువేస్తోంది. ‘పట్టణ హరిత ప్రణాళిక’ను సైతం పొందుపర్చారు. ఇందుకు సంబంధించి పట్టణ బడ్జెట్‌లో 10శాతం కేటాయించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ప్రతి వార్డులో నాలుగు కమిటీలు...

ప్రతి వార్డులో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. పట్టణాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సభ్యులను భాగస్వామ్యం చేయనుం ది. అందులో భాగంగా ప్రతివార్డులో 15మంది సభ్యుల చొప్పున నాలుగు కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఆయా వార్డుల్లో ఓటుహక్కు కలిగిన యువజన, మహిళా సంఘాల సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛందసంస్థల సభ్యులను కమిటీకి ఎంపిక చేస్తారు. ఈ కమిటీలకు వార్డు కౌన్సిలర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. నాలుగు కమిటీల్లో కలిపి మొత్తం 60 మంది సభ్యులు వార్డు అభివృద్ధిలో భాగస్వాములవుతారు. వార్డు కౌన్సిలర్‌, కమిటీ సభ్యులు కలిపి వార్డును అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. అలాగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో రూపొందించిన మార్గదర్శకాలు విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉం టుంది. లేకపోతే సంబంధిత కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ పదవులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కలెక్టర్‌ర్లకు ‘పవర్‌ పుల్‌' బాధ్యతలు అప్పగించింది. ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌' పనులతో పట్టణ ప్రగతిలో పొందుపర్చిన ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేసినా ప్రజాప్రతినిధుల పదవులు ఊడిపోతాయని హెచ్చరికలు జారీచేశారు. 

351వార్డుల్లో 21,060మంది కమిటీ సభ్యులు...

జిల్లాలో 3కార్పొరేషన్లు.. 12మున్సిపాలిటీలు 351 వార్డులున్నాయి. వీటిలో వార్డు కమిటీల నియామకం చేపట్టారు. ఒక్కో వార్డుల్లో 15మంది చొప్పున నాలుగు కమిటీల్లో 60మంది సభ్యులు ఉంటారు. మొత్తం 351 వార్డుల్లో 21,060మంది సభ్యుల నియామకం చేయనున్నారు. వీరంతా ఆయా నాలుగు కమిటీల్లో వార్డులకు నూతనంగా రానున్న కమిటీల సభ్యులు. 

ఇవే చేయాల్సిన పనులు...

పట్టణ ప్రగతిలో ప్రధానంగా పారిశుద్ధ్యం పనులు, జంగల్‌ క్లియరెన్స్‌, వయ్యారి భామ గడ్డి, జిల్లేడు చెట్లు, సర్కార్‌ తుమ్మ తొలిగింపులు, అలాగే పాత ఇళ్ల తొలిగింపు, డ్రైన్స్‌ క్లీన్‌, క్లినిక్‌ ఓపెన్‌ ప్లాట్లు, పబ్లిక్‌ ప్లేసెస్స్‌, పబ్లిక్‌ ఇన్సిస్య్టూషన్‌, కమ్యూనిటీ ఏరియాలు, పార్క్స్‌, స్కూల్స్‌, అంగన్‌వాడీలు, హెల్త్‌ సెంటర్లు, బ స్టాప్స్‌, శ్మశానవాటికలు, మార్కెట్లు శుభ్రం చేయాలి. ఓపెన్‌ వెల్స్‌, బోర్‌వెల్స్‌, పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణాలకు స్థలాల సేకరణ చేయాలి.

యాక్షన్‌ ప్లాన్‌...

ఆయా మున్సిపాలిటీలకు వాహనాలు ఎన్ని ఉన్నాయి..? ఎన్ని అవసరం ఇంకా ఉంటాయో ప్రణాళికలు రూపొందించాలి.

గ్రీన్‌ ప్లాన్‌...

నర్సరీ మొక్కలు ఎన్ని అవసరం. ఆ మేరకు నర్సరీలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి. పాత మొక్కలు ఎన్ని ఉన్నాయి.. కొత్తగా ఎన్ని మొక్కలు అవసరం ఉంది. నాటిన మొక్కలను రక్షించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలి. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా మొక్కల పంపిణీకి ఏర్పాట్లు చేస్తారు. 

పవర్‌ సప్లయ్‌...

  విద్యుత్‌ సమస్యలను అధిగమించాలి. వేలాడుతున్న వైర్లు, విరిగిన స్తంభాల తొలిగింపు చర్యలు తీసుకోవాలి. అలాగే ఇంకా అవసరమైన విద్యుత్‌ మరమ్మతులు చేయాలి. ఫుట్‌పాత్‌పై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ చర్య లు తీసుకోవాలి. అలాగే వీధిదీపాలు, మరమ్మతులు, పార్క్‌లో విద్యుత్‌ సమస్యలు, డార్క్‌ స్పాట్‌లను గుర్తించాలి. అదనపు స్తంభాలు అవసరం ఎక్కడ ఉంటాయో గుర్తించాలి. థర్డ్‌ మంజూరు చేస్తారు. అలాగే ఇళ్లపై వేల్లాడుతున్న వైర్లను పూర్తిగా తొలిగించనున్నారు. 

టౌన్‌ లెవల్‌ యాక్షన్‌ ప్లాన్‌...

గ్రౌండ్‌కు స్థలం గుర్తింపు, లోకేషన్‌తో కూడిన మ్యాప్‌ను రెడీ చేసుకోవాలి. వైకుంఠధామాల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డుకు స్థల సేకరణ చేయాలి. పార్కులు, పే గ్రౌండ్స్‌, గ్రీనరీ స్పేస్‌, డంపింగ్‌కు స్థలం, ఆటో అండ్‌ రిక్షా, స్ట్రీట్‌వెండర్‌ జోన్లు ప్రణాళికలో రూపొందించాల్సి ఉంటుంది.


logo
>>>>>>