బుధవారం 01 ఏప్రిల్ 2020
Medchal - Feb 22, 2020 , 03:04:11

దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

తలకొండపల్లి: పంచాయతీరాజ్‌ సమావేశంలో తలకొండపల్లి ఎంపీపీకి అవకాశం ఇవ్వకపోవడంతో తలకొండపల్లి ఎంపీపీ నిర్మ ల విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను బొమ్మలా పోల్చడంపై దళితసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రం లో డప్పుచప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ను అగౌరవపరుస్తూ మాట్లాడిన ఎంపీపీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బడుగు బలహీనవర్గాలకు రిజర్వేషన్‌ కల్పించిన అంబేద్కర్‌కు రాజ్యాంగమైన హోదాలో ఉండి ఆగౌరవంగా మాట్లాడటం సమంజసం కాదని అన్నా రు. కార్యక్రమంలో పడకల్‌ సర్పంచ్‌ రమేశ్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు కృష్ణ, కుమార్‌, ఆంజనేయులు, రాజు, కుమార్‌, శంకర్‌, బాలు, రాంచంద్రయ్య,  యాదయ్య, శ్రీశైలం, మహేందర్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>