శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Feb 11, 2020 , 01:06:52

నామినేషన్ల ఉపసంహరణ ముగింపు

నామినేషన్ల ఉపసంహరణ ముగింపు

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:సహకార సంఘాల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో మొత్తం తొమ్మిది సహకార సంఘాల పరిధిలోని 116 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 116స్థానాలకు గాను తొలుత సుమా రు 309 మంది అభ్యర్థులు తమతమ నామినేషన్లను దాఖలు చేశారు. అయితే ఇందులో సుమారు 102 మందినామినేషన్లను సోమవారం విత్‌డ్రాచేసుకున్నారు.  మరో 44 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 72 స్థానాలకు గాను 163 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా రు. బరిలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు గర్తులను కేటాయించారు. ఈ నెల 15వ తేదీన ఎన్నికలను నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 


జోరు ప్రదర్శించిన ‘కారు’

సహకార ఎన్నికల డైరెక్టర్‌ పదవులకు సంబంధించిన ఏకగ్రీవాల్లో ‘కారు’ జోరును ప్రదర్శించింది. జిల్లాలో మొత్తం ఏకగ్రీవమైన 44స్థానాల్లో 95శాతం మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే కావడం విశేషం. కీసరలో మొత్తం 13 వార్డులుండగా, ఇందు లో 7 డైరెక్టర్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే ఏకగ్రీవమయ్యారు.శామీర్‌పేటలో మొత్తం 13వార్డులుండగా, ఇందులో 4టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఘట్‌కేసర్‌లోనూ బీజేపీ బలపర్చిన ఇద్దరు అభ్యర్థులు బొక్క స్రవంతి, కృష్ణారెడ్డి మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. డబీల్‌పూరలో టీఆర్‌ఎస్‌ బలపర్చిన 5 మంది,అల్వాల్‌లో 6 మంది, మేడ్చల్‌లో 7మంది, పూడూరులో 7 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.


 ఏకగ్రీవమైన అభ్యర్థులను మంత్రి మల్లారెడ్డి బోయినిపల్లిలోని తన నివాసంలో అభినందించారు. అనంతరం బీజేపీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఏకగ్రీవమైన అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మర్రి రాజశేఖర్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.బరిలో ఉన్న అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని మర్రి సూచించారు.   


రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ:రంగారెడ్డి జిల్లాలో 37 సహకార సంఘాల్లోని 481 డైరెక్టర్‌ పదవులకు 1435 నామినేషన్లు దాఖలు చేయగా 501 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 99మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పలు కారణాలతో మొత్తం 9మంది డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు వెల్లడించారు. ఏకగ్రీవమైన 99 డైరెక్టర్‌ పదవులు  టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. బండ్లగూడలో మొత్తం 12 డైరెక్టర్‌ స్థానాలతో పాటు 87 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈనెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన డైరెక్టర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసి 16న పాలకవర్గాలను సమావేశ పర్చ నున్నారు. 16వ తేదీన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు.సహకార సంఘాల ఎన్నికలకు జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ పర్యవేక్షణలో జిల్లా సహకారశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.   


logo