ఆదివారం 29 మార్చి 2020
Medchal - Feb 07, 2020 , 01:16:18

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంటిపై ఐటీ దాడులు

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంటిపై ఐటీ దాడులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పీ శ్రీనివాసరావు నివాసాల్లో గురువారం ఆదాయం పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాసరావు నివాసాలతోపాటు ఆయన బంధువుల ఇండ్లలోనూ సోదా లు కొనసాగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఢిల్లీనుంచి వచ్చిన 50 మంది సభ్యులు బృందం ఈ తనిఖీలో పాల్గొనట్టు సమాచారం. పలుచోట్ల జరిపిన తనిఖీల్లో కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. 

చంద్రబాబు పీఎస్‌గా ఉండగా..

2019 అసెంబ్లీ ఎన్నికల ముందువరకు శ్రీనివాసరావు చంద్రబాబు వద్ద పీఎస్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ సచివాలయం జీఏడీలో పనిచేస్తున్నారు. ఓ బ్యాంక్ మాజీ ఉన్నతాధికారితో శ్రీనివాసరావుకు సన్నిహిత సం బంధం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సీఎంగా పనిచేసినకాలంలో సీఎంవోలో పనిచేసిన కీలక ఐఏఎస్ అధికారితో శ్రీనివాసరావుకు సాన్నిహిత్యం ఉండేదని, ఆ సాన్నిహిత్యంతోనే బాబు వద్ద పీఎస్‌గా చేరినట్టు తెలిసింది. 2014 నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు శ్రీనివాసరావు, బాబు వద్ద పీఏగా కొనసాగినట్టు తెలిసింది. ఈ సమయంలోనే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. 

కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు 

శ్రీనివాసుల రెడ్డి ఇంట్లోనూ.... 

టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఆదాయం పన్నుశాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ద్వారకనగర్‌లోని శ్రీనివాసులరెడ్డి ఇంట్లో తనిఖీలుచేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న శ్రీనివాసులరెడ్డికి చెం దిన ఆర్కే ఇన్‌ఫ్రా కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. జార్ఖండ్‌లో శ్రీనివాసులరెడ్డి చేసిన కాంట్రాక్ట్ పనుల పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. సోదా ల్లో ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం  పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు లభించినట్టు తెలిసింది. 


logo