సోమవారం 06 ఏప్రిల్ 2020
Medchal - Feb 07, 2020 , 01:12:40

పోలీసులమని చెప్పి.. దోచుకున్నారు

 పోలీసులమని చెప్పి.. దోచుకున్నారు

బండ్లగూడ : పోలీసులమని చెప్పి.. కిరాణా వ్యాపారి నుంచి లక్ష రూ పాయల సొత్తును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఏసీపీ అశోక చక్రవర్తి  కథనం ప్రకారం.. కోస్గి ప్రాంతంలో కిరాణా వ్యాపా రం నిర్వహించే రవి ఇటీవల బేగంబజార్‌కు కిరాణ సామగ్రి కొనేందుకు వచ్చాడు. అనంతరం కారులో రాత్రి 8గంటల సమయంలో కిరాణా సామగ్రి తీసుకొని  తిరుగు ప్రయాణమయ్యాడు. పోలీసు అకాడమి వద్దకు వెళ్లగానే... పాతబస్తీకి చెందిన నలుగురు సైఫ్‌బిన్ అహ్మద్‌బషీర్ అలియాస్ అదిల్ (24), అబ్దుల్లా బషీర్ (27), మహ్మద్ ముస్తాబ అలీ (22), షాహిద్ హుస్సేన్ (19) కారును ఆపి.. వేగంగా వెళ్లొద్దు  సూచించారు. అనంతరం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి చేరుకోగా అక్కడ మరోసారి ఆపి తాము పోలీసులమని  రవి, డ్రైవర్ ను కారులో ఎక్కించుకొని తుక్కుగూడ వైపు తీసుకువచ్చారు. రవి  పేటీఎం నుంచి రూ.29వేలను వారి పేటీఎంకు ట్రాన్స్‌ఫర్ కొట్టుకున్నా రు.  అనంతరం వారిని అక్కడే వదిలేసి సామగ్రితో సహా పరారయ్యారు. అనంతరం రవి మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి ఫిర్యాదు చేయగా..  పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.  వారి నుంచి నగదుతో పాటు కిరాణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.logo