ఆదివారం 29 మార్చి 2020
Medchal - Feb 03, 2020 , 04:22:06

ముచ్చట కథ, స్క్రీన్‌ ప్లే

ముచ్చట కథ, స్క్రీన్‌ ప్లే

 సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-భాషా సాంస్కృతిక శాఖ ‘కథా రచన, సినిమా నిర్మాణం, పాత, కొత్త సినిమాలు -వాటిలో వచ్చిన మార్పులు, తదితర అంశాలపై ఆది వా రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూసుఫ్‌గూడలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ) మినీ ఆడిటోరియంలో “ముచ్చట<\@>కథ, స్క్రీన్‌ ప్లే”పై భాషా సాంస్కృతిక ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ చర్చా కార్యక్రమంలో  రాష్ట్ర వ్యాప్తంగా 60 మందికి పైగా ఔత్సాహిక దర్శకులు, రచయితలు, పలువురు ఇతర రంగాల నిఫుణలు పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సినిమా నిర్మాణంలో ఎదురయ్యే పలు అవరోధాలు, ఒడిదొడుగులపై నిష్ణాతులు ఆశావాదులకు, యువతరానికి అవగాహన కల్పించారు. సినిమా నిర్మాణంలోని 24 విభాగాలపై చర్చ కొనసాగగా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు వారి విలువైన సమాచారాన్ని, సలహాలను, విజ్ఞానాన్ని యువతరం ముందుంచారు. కార్యక్రమంలో ప్రముఖ కథకులు అల్లం రాజయ్య,   సినీ దర్శకులు ఉమా మహేశ్వర్‌ రావు, కథకులు - సినీ విమ ర్శకులు కస్తూరి మురళీ కృష్ణ, ప్రముఖ స్క్రీన్‌ప్లే రచయిత హరి (ఊపిరి, మహర్షి), ప్రముఖ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ (బ్రోచేవారెవరురా..)లు పాల్గొన్నారు.  సదస్సు ఆద్యంతం సినిమా కథ, స్క్రీన్‌ ప్లేపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సమన్వయకర్తగా ఆసరి అక్షర కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo