బుధవారం 08 ఏప్రిల్ 2020
Medchal - Feb 03, 2020 , 04:21:05

హెచ్‌సీయూలో ‘విజ్ఞానోత్సవ్‌'

హెచ్‌సీయూలో ‘విజ్ఞానోత్సవ్‌'

కొండాపూర్‌:  సెంట్రల్‌ యూనివర్సిటీ విజ్ఞానోత్సవ్‌ -2020ని వర్సిటీ జూని యర్‌ సైన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐఎస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ సుబోధ్‌ హాజరై ప్రారంభించారు. అనంతరం డాక్టర్‌ వీవీఎస్‌ఎస్‌ శ్రీకాంత్‌ ‘వేస్టేజ్‌ టూ యూసేజ్‌' అం శంపై ప్రసంగించారు. వివిధ పాఠశాలలకు చెందిన 170 మంది విద్యార్థులు విజ్ఞానోత్సవంలో పాల్గొనగా, వారికి సైన్స్‌ విభాగంలో  పోటీలను నిర్వహించారు. క్విజ్‌, జామ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ తదితర పోటీలను నిర్వహించారు. అనంతరం సైన్స్‌ విభాగంలోని ల్యాబ్‌లను విద్యార్థులు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్‌ ఎస్‌ అయ్యంగోవన్‌, ప్రొఫెసర్‌ శర్మిస్థ బెనర్జీలు జేఆర్‌సీ కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు.


logo