బుధవారం 01 ఏప్రిల్ 2020
Medchal - Feb 03, 2020 , 04:11:21

గచ్చిబౌలిలో ‘ రన్‌ ఫర్‌ చైల్డ్‌ గర్ల్‌'

గచ్చిబౌలిలో ‘ రన్‌ ఫర్‌ చైల్డ్‌ గర్ల్‌'


శేరిలింగంపల్లి : బాలికల సాధికారిత లక్ష్యంగా కిశోర్‌ వికాస్‌, సేవా భారతిల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో “ రన్‌ ఫర్‌ చైల్డ్‌ గర్ల్‌ ” 4వ ఎడిషన్‌ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ కోదండరామ్‌, రోడ్‌ సేప్టీ అథారిటీ చైర్మన్‌ కృష్ణప్రసాద్‌ ముఖ్యఅతిథులుగా హాజరై జెండాఊపి ప్రారంభించారు. 5, 10 , 21 కిలోమీటర్లు మొత్తం మూడు విభాగాల్లో ఈ పరుగు పదెం నిర్వహించారు. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లోని వివిధ ఐటీ సంస్థలకు చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల విద్యార్థులు, వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు దాదాపు 7000 మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.  కిశోర్‌ వికాస్‌ లబ్ధిదారుల ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ అంశాల్లో నిర్వహించిన ఆత్మరక్షణ ప్రదర్శనలు అందర్ని ఆకట్టుకున్నాయి. నగరంలోని 5348 మంది లబ్ధిదారులకు 210 కేంద్రాల ద్వారా సేవలందించడం జరుగుతున్నదని, ఈ రన్‌ ఫర్‌ చైల్డ్‌ కార్యక్రమం మరో 10,000 మందికి విద్య, ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధికి నిధుల సేకరణకు ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. logo
>>>>>>