గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Feb 03, 2020 , 03:56:33

ఇంధనాన్ని పొదుపుగా వాడాలి

ఇంధనాన్ని పొదుపుగా వాడాలి

కాప్రా : ఇంధనాన్ని పొదుపుగా వాడాలని, వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని, అత్యవసరమైతేనే ఇంధన వాహనాలను ఉపయోగించాలని పెట్రోలియం కన్సర్వేషన్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ (పీసీఆర్‌ఏ) రీజినల్‌ కోఆర్డినేటర్‌ చరియన్‌ జోసెఫ్‌ అన్నారు. ఆదివారం ఇంధన పొదుపు, కాలుష్య నివారణ అంశంపై ఆయిల్‌ కంపెనీలు, పీసీఆర్‌ఏ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఐసీ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించి, ఈసీఐఎల్‌ వరకు ‘వాకథాన్‌' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీఆర్‌ఏ ప్రాంతీయ కోఆర్డినేటర్‌ చరియన్‌ జోసెఫ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొబైల్‌ వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పీసీఆర్‌ఏ మేనేజర్‌ జేఎం నాయక్‌, గెయిల్‌ మేనేజర్‌ రవీందర్‌రెడ్డి, హెచ్‌పీసీఎల్‌ మేనేజర్‌ టి.శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌ఐసీ డీజీఎం విష్ణుమూర్తి, అథ్లెట్‌ ప్రభాకర్‌రావు, సంజయ్‌కుమార్‌, రామతులసి పాల్గొన్నారు. 


logo
>>>>>>