శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medchal - Feb 01, 2020 , 02:18:00

చిన్నారుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించాలి

చిన్నారుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించాలి

శామీర్‌పేట : మారుతున్న సమాజంలో రాకేట్‌లా దూసుకుపోవాల్సిన యువతపై లింగ వ్యత్యాసం, సెల్‌ఫోన్లు, టీవీలు పెనుప్రభావాన్ని చూపుతున్నాయని ప్లాన్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ అవేదన వ్యక్తం చేశారు. ప్లాన్‌ ఇండియా రెండవ దశ ఎడిషన నేషనల్‌ చిల్డ్రన్‌ లిటరరీ ఫెస్టివెల్‌-2020 కార్యక్రమం జనవరి 29 నుంచి 31వ తేదీ వరకు మేడ్చల్‌ జిల్లా దేవరయాంజాల్‌లో జరిగింది. సాహిత్య ఉత్సవంతో చిన్నారుల్లో పుస్తక పఠనం, కథలు, ఆట-పాటలు, సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించడం, లింగ సమానత్వం లక్ష్యంగా ప్లాన్‌ ఇండియా కృషి చేస్తుందన్నారు. తెలంగాణ, బీహార్‌, ఢిల్లీ, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు రాష్ర్టాల నుంచి 120 మంది విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, సాహిత్య వేత్తలు, రచయితలు పాల్గొన్నారు. చదువు, విజ్ఞానం, వినోదంతో ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన యువత ఎంత సేపు టీవీకి, సెల్‌ఫోన్లకు అంటుకుపోతున్నారన్నారు. దీంతో చదువు, సాహిత్యం, సామాజిక బాధ్యతలను మరచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌, రాసిన పుస్తకాలు, చిత్రాలు ఎంతో ప్రేరణగా ఉన్నాయని, సమాజంలో లింగం సమానత్వంపై చిన్నారులు చేసిన కృషిని అభినందించారు. బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేయూతనిచ్చింది. కార్యక్రమంలో ప్లాన్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo