సోమవారం 30 మార్చి 2020
Medchal - Feb 01, 2020 , 02:10:18

హెల్మెట్‌ పెట్టుకోండి..

హెల్మెట్‌ పెట్టుకోండి..
  • ఉచితంగా లీటరు పెట్రోల్‌ పొందండి

మన్సూరాబాద్‌, జనవరి 31 : ట్రాఫిక్‌ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న తరహాలో కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని హెల్మెట్‌ వాడకం వలన కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు, చింతలకుంట ప్రాంతాలలో నిర్వహించిన ఈ కార్యక్రమం వాహనదారులను చైతన్య పరిచింది. ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ అదనపు ఇన్‌స్పెక్టర్‌ అంజపల్లి నాగమల్లు ఆధ్వర్యంలో పలు కూడళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బైకును నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చొని హెల్మెట్‌ ధరించి ఉన్నవారిని పూలదండలతో సత్కరించారు. అదేవిధంగా ట్రాఫిక్‌ అదనపు సీఐ నాగమల్లు తన సొంత ఖర్చులతో ఒక్కొక్కరికీ లీటరు పెట్రోలు కూపన్లు 20 మంది వాహనదారులకు అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా అంజపల్లి నాగమల్లు మాట్లాడుతూ ఏదేని ప్రమాదాలు సంభవించిన సమయంలో హెల్మెట్‌ ధరించకపోవడం వలన 60 శాతం మంది వాహనదారులు చనిపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై రమేశ్‌, సిబ్బంది భాస్కర్‌, సాయికుమార్‌, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo