ఆదివారం 29 మార్చి 2020
Medchal - Jan 30, 2020 , 00:40:25

మత్తు మైకం చిత్తయిపోతున్న జీవితం

మత్తు మైకం చిత్తయిపోతున్న జీవితం
  • మద్యానికి బానిసలైన వారికి విముక్తి కల్పిస్తున్న ‘నెస్ట్‌'

బండారి జార్జివిల్సన్‌ (వినాయక్‌నగర్‌) : మత్తు మైకంలో చిత్తయిపోతున్న జీవితాలను చక్కదిద్దేందుకు ‘నెస్ట్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌' పని చేస్తుంది. మద్యానికి బానిసలైన వారికి  ఆశ్రయం కల్పించి మూడు నుంచి ఆరు నెలలపాటు కౌన్సెలింగ్‌ చేస్తూ డీటాక్సినేషన్‌ కోసం పరిశీలనలో పెడుతుంది. వ్యక్తిగతంగా కుంటుంబ సభ్యులతో కలసి కౌన్సెలింగ్‌ ఇస్తూ రోజూ వ్యాయామం, యోగా, ఇండోర్‌ గేమ్స్‌, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వ్యక్తిగత సమస్యలకు సానుకూలంగా స్పందించి వారికి ధైర్యం చెప్పి మార్పు తీసుకురావడానకి కృషి చేస్తుంది. 


ఏమైయింది ప్రసున దిగాలుగా ఉన్నావంటూ స్నేహితుల ప్రశ్నలు.. ఏమిలేదని ముబావంగా సమాధానం.. ఏదో ఉందిలే.. దాస్తున్నావంటూ స్నేహితులు ప్రశ్నల వర్షం.. అబ్బే ఏమిలేదంటూ దాటవేసిన ప్రసున.. భర్త పూటుగా తాగుతాడు.. రైల్వేలో ఉద్యోగం చేస్తున్నా తాగుడు వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారింది. కంటి మీద కునుకు కరువైయింది ప్రసునకు. ఒకటే ఆందోళన చిన్నపాప.. అప్పటికే గర్భంతో ఉన్న తనకు దిక్కుతోచన పరిస్థితి.. ఇతనిలో మార్పుతీసుకురావాలని ఒకటే ఆలోచన.. ఆర్థిక ఇబ్బందులతో టీచర్‌గా మల్కాజిగిరిలోని ప్రైవేటు స్కూల్‌లో ఉద్యోగంలో చేరింది ప్రసున. ఒకరోజు సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో ‘మెడికల్‌ ఎగ్జిబిషన్‌'కు విద్యార్థులతోపాటు టీచర్‌గా వెళ్లింది ప్రసున. అక్కడ స్టాల్స్‌ను పరిశీలించగా ‘రిహాబిలిటేషన్‌' కౌంటర్‌లో తాగుడుకు బానిసైన వారిగురించి లిటరేచర్‌ తీసకుంది. అక్కడ ఉన్న వైద్యులు ఏంటమ్మ..?.. అంటూ ప్రసునను ప్రశించారు. ఏమిలేదని చెబుతుంటే పర్వాలేదు చెప్పండి అంటు వైద్యులు చొరవ తీసుకోవడంతో భర్త సత్యం తాగుడుకు బానిసైనాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ ‘సోబర్‌ లైఫ్‌' బుక్‌ను కొన్నది. పూర్తిగా చదివి అర్థం చేసుకుంది. భర్త సత్యంను చదవమని ఇచ్చింది. అతను ససేమిరా అంటూ బీష్మించుకున్నాడు. ఇైట్లెతే మారడంటూ.. బలవంతంగా నేరేడ్‌మెట్‌ రామకృష్ణాపురంలోని ‘కేర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌'లో చేర్పించింది. గుండెలో నుంచి ఉప్పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకంటూ ఇంటికొచ్చి పాపను హృదయానికి హత్తుకుని ఏడ్చింది.


భర్తను రిహాబిలిటేషన్‌లో చేర్చి...

ప్రేమించి సత్యనారాయణ(సత్యం)ను వివాహం చేసుకుంది ప్రసున. ఆయన మెడికల్‌ రెప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలసి మద్యానికి అలవాటుపడ్డాడు. అంతలోగా రైల్వేలో ఉద్యోగం వచ్చింది. మద్యం అలవాటు మాన్పించడానికి ప్రసున చేయని ప్రతయ్నమంటూ లేదు. అప్పుడప్పుడు మద్యం మత్తులో రోడ్లుపైన పడేవారు. ఒక సంవత్సరం విడిగా ఉన్నారు. అయితే కుటుంబంలో తృప్తి లేదు. పిల్లల కోసం జీవించక తప్పదనిపించింది ప్రసునకు. ఆయనలో మార్పు తీసుకురావడానికి ఉన్న బంగారుఆభరణాలను తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో రామకృష్ణాపురంలోని ‘కేర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌'లో చేర్పించింది. ఆయనలో మార్పు వచ్చింది. ఉద్యోగంలో చేరాడు. ఇంట్లో పిల్లల సం దడి.. ‘డాడీ ఈజ్‌ గుడ్‌' అంటూ ఇద్దరు పిల్లలు తండ్రికి ముద్దులు పెడుతుంటే కుటుంబంలో పట్టలేని ఆనందం. నా భర్త లాంటి వారికి మత్తు నుంచి విముక్తి కల్పించాలని ప్రసున మనసులో ధృడమైన సంకల్పం కలిగింది. దీంతో ప్రత్యే శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం సెంటర్‌లో దాదాపు 30మంది బాధితులు ఉన్నారు. వారిలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్‌ చేస్తున్నారు.


మరికొందరికి మార్గదర్శకంగా ...

మద్యం, సారా, దగ్గు మందు, మత్తు ఇన్‌జక్షన్లు, నిద్రమాత్రలు, ఎల్‌ఎస్‌డీ, గం జాయి, డ్రగ్స్‌ వంటివి అనేకమంది భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయి. ఈ వ్యసనాల వల్ల నేరాలు, గృహహింస పెరుగుతుంది. ఉన్న ఉద్యోగం పోతుంది. అం దుకే తాగుడు మాన్పించడానికి మల్కాజిగిరికి చెందిన ప్రసున కృపాకాంప్లెక్స్‌ సిద్ధార్థనగర్‌లో 2007లో ‘నెస్ట్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌'ను ప్రారంభిం చాం. ఇప్పటివరకు దాదాపు వెయ్యిమందికి మత్తు నుంచి విముక్తి కల్పిం చాం. మూడు నుంచి ఆరు నెలల వరకు కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి మొదటి వారంరోజులు వారికి పూర్తిగా విశ్రాంతిలో ఉంచుతాం. డి-టాక్సినేషన్‌ కోసం వారిని పరిశీలనలో పెడ తాం. వ్యక్తిగత కౌన్సెలింగ్‌తోపాటు కుంటుంబ సభ్యులతో కలసి కౌన్సెలింగ్‌ ఇస్తాం. రోజూ వ్యాయామం, యోగా, ఇండోర్‌ గేమ్స్‌, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు న్విహిస్తున్నాం. వ్యక్తిగత సమస్యలకు సానుకూలంగా స్పందించి వారికి ధైర్యం చెప్పి వారిలో మార్పును తీసుకురావడానకి కృషిచేస్తున్నాం. నామమాత్రం ఫీజులు తీసుకుంటూ పేదవారికి ఉచితంగా చికిత్సలు అందజేస్తున్నాం. పూర్తిస్థాయిలో కోలుకున్న వారిలో కొందరు ఇక్కడే సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్‌, మెదక్‌, సంగారెడ్డి, నల్లగొండ వంటి ప్రాంతాల నుంచి బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. అందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి కుం టుంబంతో ఆనందంగా ఉండడానికి జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి.

- ప్రసూన, డైరెక్టర్‌, నెస్ట్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌logo