శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Jan 25, 2020 , 03:10:28

జోరుగా పాడిపశువుల జాతర

జోరుగా పాడిపశువుల జాతర
  • -వ్యాపారులతో కిటకిటాడిన నార్సింగి ‘పశుసంక్రాంతి’
  • - దేశనలుమూలల నుంచి హాజరైన పాల,పశు వ్యాపారులు

మణికొండ(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికే వన్నె తీసువచ్చే ‘పశుసంక్రాంతి’ నగర శివారు ప్రాంతంలోని నార్సింగిలో శుక్రవారం ‘పశువులసంత’ ఘనంగా సాగింది. దేశ నలుమూలల నుంచి వచ్చిన పాల, పశువ్యాపారులతో జాతర కళకళలాడింది. గుజరాత్‌ జాప్రీలు, హర్యానా ముర్రాలు, ఒంగోలు గిత్తలతో పోటాపోటీగా వ్యాపారాలు సాగాయి.  లక్షాది  రూపాయల వ్యాపారం జరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న ఈ పశువుల జాతరకు రాష్ట్రంలోని సిద్దిపేట, సంగారెడ్డి, జోగిపేట, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాలతో పాటు మహా రాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఒరిస్సా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా,ఛత్తీస్‌ఘడ్‌, బీహార్‌, రాష్ర్టాల నుంచి  పాల, పశు వ్యాపారులు తరలివచ్చారు. ఈ చారిత్రాత్మక ‘పశుసంక్రాంతి’ సంతలో గతేడాది కన్నా ఆశించిన స్థాయిలో వ్యాపారాలు జరుగలేదని వ్యాపారస్తులు అంటున్నారు. ఈసారి ఆశించిన స్థాయిలో ధరలు పలకపో వడం విశేషం.

పాల వ్యాపారుల ఇంట సిరులు కురిపించే బర్రెల కోసం పాల వ్యాపార స్తులు పోటీలు పడి బర్రెలను కొనుగోలు చేసినట్లు ఎక్కడా కన్పించలేదు. అత్యధికంగా గుజరాతి జాతికి చెందిన జాఫ్రీ బర్రెలు, అధిక ధరలు పలికాయి. ముర్రా,జాఫ్రీ జాతి గేదెలను రూ.లక్షకుపై గానే విక్రయాలను సాగినట్లు అధికారులు తెలిపారు.
నార్సింగి గ్రామ మార్కెట్‌ కమిటీ  ప్రాంగణంలో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘పశుసంకాంత్రి’ జాతరకు రాజేంద్రనగర్‌ మండలానికి చెందిన ప్రముఖులు, ప్రజాప్రతి నిధులు విచ్చేసేవారు. కానీ ఈసారి స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎన్నికలు జరు గడంతో నాయకులెవ్వరు పెద్దగా కన్పించలేదు.  మార్కెట్‌ కమిటీ పాలకవర్గీయుల సై తం  పశు జాతరలో కన్పించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాదికి ఓసారి జరిగే పశువుల జాతరకు కూడా పాలకవర్గం ఉండకపోవడంపై అంతా విస్మయం వ్యక్తం చేశారు. ముందస్తుగా ఏర్పాటు చేసిన సౌకర్యాలతో ప్రజలకు  ఇబ్బందులు తలెత్తలేదు.


logo