బుధవారం 01 ఏప్రిల్ 2020
Medchal - Jan 25, 2020 , 03:06:52

పబ్లిక్‌ గార్డెన్స్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు

పబ్లిక్‌ గార్డెన్స్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు
  • రేపు ఉదయం 9 నుంచి 12 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  పబ్లిక్‌గార్డెన్స్‌లో ఆదివారం జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు  నాంపల్లిలో పబ్లిక్‌ గార్డెన్స్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా జంక్షన్ల వద్ద  ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలలోకి మళ్లిస్తున్నట్లు వివరించారు.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..!

-తాజ్‌ ఐలాండ్‌: ఎంజేమార్కెట్‌ వైపు నుంచి పబ్లిక గార్డెన్‌కు వెళ్లే సాధారణ వాహనదారులను తాజ్‌ ఐలాండ్‌ వద్ద ఎక్‌మినార్‌, అసీఫ్‌నగర్‌, రెడ్‌హిల్స్‌, అయో ధ్య హోటల్‌, లక్డీకపూల్‌ వైపు మళ్లిస్తారు.

- చాపల్‌ రోడ్డు టీ జంక్షన్‌: నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ వైపు వెళ్లే వాహనాలను చాపల్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద మళ్లిస్తారు. చాపల్‌ రోడ్డు, గన్‌ ఫౌండ్రీ, అబిడ్స్‌ రోడ్డు, బషీర్‌బాగ్‌ రూట్లలో గమ్యస్థానాలకు చేరుకోవాలి.
-ఓల్డ్‌ పీఎస్‌ సైఫాబాద్‌: నిరంకారి భవన్‌ అండ్‌ ఖైరతాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్‌ సైఫాబాద్‌ ఠాణా వద్ద టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, సచివాలయం గేట్‌, తెలుగుతల్లి ైప్లెవోర్‌, అంబేద్కర్‌ విగ్రహాం, లిబర్టీ, బషీర్‌బాగ్‌ వైపు మళ్లిస్తారు.
- బషీర్‌బాగ్‌ జంక్షన్‌: హైదర్‌గూడ, కింగ్‌కోఠి, బీజేఆర్‌ విగ్రహాం వైపు నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూం, పబ్లిక్‌ గార్డెన్‌ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి లిబర్టీ, తెలుగుతల్లి, ఎన్టీఆర్‌మార్గ్‌, ఇక్బాల్‌ మినార్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ ఠాణా, లక్డీకపూల్‌ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్‌ మినార్‌: ట్యాంక్‌బండ్‌ నుంచి రవీంధ్రభారతి వైపు వెళ్లే వాహనాలను టెలిఫోన్‌ భవన్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ ఠాణా, లక్డీకపూల్‌ రూట్‌లో మళ్లిస్తారు.
-ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌: సుజాత స్కూల్‌, గన్‌పౌండ్రీ, బీజేఆర్‌ విగ్రహాం వైపు నుంచి పబ్లిక్‌గార్డెన్స్‌ వైపు వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద బీజేఆర్‌ విగ్రహాం చౌరాస్తా వైపు మళ్లిస్తారు.
- ఆదర్శనగర్‌: తెలుగుతల్లి, ఎన్టీఆర్‌మార్గ్‌ వైపు నుంచి కంట్రోల్‌ రూం వైపు వచ్చే వాహనాలను ఆదర్శనగర్‌ జంక్షన్‌ వద్ద లిబర్టీ, తెలుగుతల్లి ైప్లెవోర్‌ దారిలో మళ్లిస్తారు.

బ్యాగ్‌లు, సూట్‌కేస్‌, కెమెరాలతో రావొద్దు

 రిపబ్లిక్‌ డే వేడుకలకు వచ్చేవారు హ్యాండ్‌ బ్యాగ్స్‌, సూట్‌కేస్‌, కెమెరా, టిఫిన్‌ బాక్స్‌ తదితర వస్తువులతో పబ్లిక్‌గార్డెన్స్‌కు రావద్దని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు. ఎవరై నా అలాంటి వస్తువులతో వస్తే తప్పనిసరిగా పోలీసులు తనిఖీల్లో పట్టుబడతారన్నారు. భద్రతలోభాగంగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైనప్పుడు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, విధి నిర్వాహణలో ఉన్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సీపీ సూచించారు.

కంటోన్మెంట్‌ ప్రాంతంలో...

రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా కంటోన్మెంట్‌ ప్రాం తంలోని ఏఓసీ సెంటర్‌లోకి ప్రవేశించే మార్గాన్ని తాత్కాలికంగా కిర్కి గేట్‌, స్టార్‌ అండ్‌ గో బేకరి, సఫిల్‌గూడ గేట్‌, మహింద్రహిల్స్‌ చెక్‌పోస్టు(మారేడ్‌పల్లి ట్రాఫిక్‌ ఠాణా పరిధి), కేంద్రీయ విద్యాలయం మూసివేస్తున్నట్లు ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. 24వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 25వ తేదీ ఉదయం 6 గంటల వరకు, 25వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 26వే తేదీ ఉదయం 6 గంటల వరకు, 26వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆయన వివరించారు.
logo
>>>>>>