మంగళవారం 31 మార్చి 2020
Medchal - Jan 23, 2020 , 02:00:35

డొంక కదులుతున్నది

 డొంక కదులుతున్నది
  • -టీఆర్ వ్యవహారంలో మొదలైన విచారణ
  • - పలు షోరూంలకు నోటీసులు జారీ
  • - ఖరీదైన కార్లతోపాటు ద్విచక్రవాహనాల విక్రయాలపైనా ఆరాసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: టీఆర్ లేకుండా వాహనాలు విక్రయించిన వ్యవహారంపై.. రవాణాశాఖ విచారణలో తవ్వుతున్న కొద్దీ డొంక కదులుతున్నది. కోటి నుంచి కోటిన్నర రూపాయల విలువైన చాలా కార్లను టీఆర్ లేకుండా విక్రయించినట్లు తెలుస్తుంది. రూ.10 లక్షలు దాటిన  ఏ వాహనానికైనా వినియోగదారుడు 14 శాతం లైఫ్ చెల్లించాలి. కోటి రూపాయల వాహనానికి  రూ.14 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లైఫ్ తప్పించుకోవడానికే టీఆర్ లేకుం డా వాహనాలు విక్రయించినట్లు తెలుస్తుంది.

టీఆర్ లేకుండా వాహన విక్రయాలు జరిపిన వ్యవహారంపై రవాణాశాఖ సీరియస్ చర్యలు చేపట్టింది. మొదట్లో మామూలు వ్యవహారం అని భావించినప్పటికీ తవ్వుతున్న కొద్దీ డొంక కదులుతున్నది. కోటి నుంచి కోటిన్నర రూపాయల విలువైన కార్లకు మాత్రమే టీఆర్ ఇవ్వకుండా వాహనాలు విక్రయించాయని భావించినప్పటికీ ఇలా ఇప్పటివరకు చాలా వాహనాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఐతే ఇటువంటి హైఎండ్ కార్ల వ్యవహారం మొదటిదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీఆర్ ఇవ్వకుండా వాహనాలు విక్రయిస్తున్న షోరూంలు బోలెడున్నట్లు అధికారులు ఆరా తీస్తే బయటపడ్డట్లు తెలిసింది. దీని వెనుక కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలున్నట్లు చెబుతున్నారు.

రూ.10 లక్షల విలువ దాటిన ఏ వాహనానికైనా వినియోగదారుడు 14 శాతం లైఫ్ చెల్లించాల్సి ఉంటుంది. కోటి రూపాయల విలువైన వాహనానికి కనీసం రూ.14 లక్షల విలువైన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐతే దీనిని కట్టకుండా తప్పించుకోవడానికి టీఆర్ లేకుండా వాహనాలు ఇచ్చి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఒక్కో వాహనానికి రూ.14 లక్షలంటే దాదాపు 32 వాహనాల లైఫ్ దాదాపు రూ.4కోట్ల పై చిలుకు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడితే చాలా కార్యాలయంలో ఇటువంటి వాహనాలు చాలా బయటపడుతాయని చెబుతున్నారు. ఐతే హైదరాబాద్ జరిగిన టీఆర్ వాహనాల విక్రయాలు విషయం సీరియస్ మారింది.  ఈ వ్యవహారంలో హైదరాబాద్ జేటీసీ పాండురంగనాయక్ సదరు షోరూంకు నోటీసులు జారీచేశారు. బుధవారం మధ్యాహ్నం వరకు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నప్పటికీ నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వలేదని తెలిసింది.

వారం రోజులు గడువు కోరిన షోరూం యజమాన్యం

జరిగిన విక్రయాలకు సంబంధించి వివరణ ఇవ్వడానికి వారం రోజులు గడువు కావాలని సదరు షోరూం యాజమాన్యం రవాణాశాఖను కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని రవాణాశాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. టీఆర్ లేకుండా వాహనాలు విక్రయించిన సదరు షోరూం యాజమాన్యం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ కలిసినట్లు తెలిసింది. అనంతరం రవాణాశాఖ కార్యాలయానికి వచ్చి సమ యం కోరినట్లు తెలిసింది. ఐతే ఈ వ్యవహారంపై ఇంటలీజెన్స్ విభాగం వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి టీఆర్ లేకుండా వాహనాలు విక్రయించిన వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతున్నది.
logo
>>>>>>