బుధవారం 08 ఏప్రిల్ 2020
Medchal - Jan 23, 2020 , 01:56:09

పిల్లలే పర్యావరణవేత్తలు

పిల్లలే పర్యావరణవేత్తలు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్విట్జర్లాండ్ 16ఏండ్ల  గ్రెటా తున్ అనే బాలిక పర్యావరణంపై భారీ ఉద్యమాన్ని నిర్వహించింది. ‘పర్యావరణాన్ని నాశనం చేస్తా రా.. భవిష్యత్తు తరాలైన మేం ఎలా బతకాలి. మాకు మంచి పర్యావరణాన్ని ఇవ్వరా..? అంటూ ప్రశ్నించి యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించింది. ఏకంగా పార్లమెంట్ ఎదుట ప్రదర్శనలు నిర్వహించి నినదించింది. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో సైతం గొంతెత్తి మాకు కొంచెం మిగిల్చిండి అంటూ ప్రసంగించింది. గ్రెటా తున్ ఉద్యమ ఫలితంగా స్థానికంగా ఉన్న పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకుగానూ గ్లోబల్ లెర్నింగ్ అండ్ ఆబ్జర్వేషన్స్ టూ బెన్ ది ఎన్విరాన్ (ది గ్లోబ్ ప్రో గాం) కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచవ్యాప్తం గా 122 దేశాల్లో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. వాతావరణం రోజురోజు శరవేగంగా మారుతోంది. ఎప్పుడు..

ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంతుచిక్కడం లేదు. సంవత్సరంలో నాలుగు మాసాలు ఎండా, వాన, చలికాలాలుండేవి. కానీ ఇప్పుడు తెల్లవారుజామున చలి.. మధ్యాహ్నానికే ఎంత.. సాయంత్రానికి వర్షం పలకరించే రోజుల్లో మన జీవిస్తున్నాం. అంతగా వాతావర ణం వేగంగా మారుతున్నది. దీనికి తోడు పర్యావరణంపై అధ్యయనా లు జరగడం లేదు. దీని ఫలితంగా కాలుష్యం కోరలు చాస్తున్నది. పర్యావరణం దెబ్బతింటున్నది. దీనికి పరిష్కారంగా ది గ్లోబ్ ప్రొగ్రాంను పలు దేశాల్లో అనుసరిస్తున్నారు. మనదగ్గర సైతం కేంద్ర పర్యావరణ, ైక్లెమేట్ మంత్రిత్వశాఖ సైతం గ్లోబ్ యాక్టివిటీకి ప్రాధాన్యతనిస్తున్నది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పౌరులు పర్యావరణంపై కలిసి పనిచేయడం, పర్యావరణ మార్పులను అవగాహన చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
 

పర్యావరణ ప్రొటోకాల్

తెలంగాణలో 150 పాఠశాలలు ఎంపికగా ఒక్కో స్కూల్ నుంచి ఒక్కో ఉపాధ్యాయుడిని గ్లోబ్ టీచర్ ఎంపిక చేశారు. తెలంగాణలో 5100 పర్యావరణ క్లబ్బులు ఉన్నా యి. నేషనల్ గ్రీన్ కార్ఫ్స్ (ఎన్ ఆధ్వర్యంలో ఇవన్నీ నడుస్తున్నాయి. వీటిలో నుంచి 150 పాఠశాలలను గ్లోబ్ యాక్టివిటీ కింద ఎంపిక చేశారు. 150లో హైదరాబాద్ 50 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ పాఠశాలలకు రూ.7,000 విలువ కలిగిన టెస్ట్ కిట్ అందజేశారు. వీటి ద్వారా 16 పర్యావరణ టెస్ట్ నిర్వహించవచ్చు. పర్యావరణ ప్రొటోకాల్ ప్రకారం ఉష్ణోగ్రతలు, వాతావరణం, కాలుష్యం తదితరాలను పరీక్షించవచ్చు. విద్యార్థులతో నిర్వహించి, పరీక్షల ద్వారా వెల్లడైన పర్యావరణ గణాంకాలను వెబ్ పొందుపరుస్తారు. నెలకోసారి పరీక్షలను నిర్వహించి వాతావరణంలో వస్తున్న మార్పులను ఆధ్యయనం చేసి పరిష్కారాలను కనుగొంటారు.

లాభాలు, ఉద్దేశాలు

- విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు అలవర్చడం. సైన్స్, పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడం.
- ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలతో కలిసిపనిచేసే అవకాశాన్నివ్వడం, ఫీల్డ్ సేకరించడం, విశ్లేషించడం.
- సైన్స్ సంబంధిత పరికరాల వాడటాన్ని ప్రొత్సహించడం. ఆచరిస్తూ నేర్చుకోవడాన్ని అలవాటు చేయడం.
logo