శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Jan 21, 2020 , 00:47:20

ఫేస్‌ రికగ్నీషన్‌ యాప్‌ ప్రారంభం

ఫేస్‌ రికగ్నీషన్‌ యాప్‌ ప్రారంభం

పేట్‌బషీరాబాద్‌: దేశంలోనే మొదటిసారిగా ఫేస్‌ రికగ్నీషన్‌ యాప్‌ ప్రారంభానికి కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ వేదికైంది. దొంగ ఓట్లను వేయకుండా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం టీ యాప్‌ పోలియో ప్రారంభిచేందుకు శ్రీకారం చుట్టింది. సోమవారం కొంపల్లి మున్సిపాలిటీ మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల అధికారి, డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ టీకే శ్రీదేవి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ ఎంవీరెడ్డి, ఎలక్షన్‌ కమిషన్‌ అసిస్టెంట్‌ సెక్రెటరీ విష్ణుప్రసాద్‌ టీ యాప్‌ పోటీ చేసే అభ్యర్థులు, ఏజెంట్ల, అధికారుల సమక్షంలో ప్రారంభించారు. పలువురు ఓటర్ల ఫేస్‌లను స్కాన్‌ చేసి చూపించారు. ఈ సందర్భంగా టీకే శ్రీదేవి, జిల్లా కలెక్టర్‌ ఎంవీరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక వినూత్నమైన యాప్‌ను పరిచయం చేస్తుందన్నారు. దేశంలోనే మొదటి ఫేస్‌ రికగ్నీషన్‌ యాప్‌ను ఉపయోగించేందుకు కొంపల్లిని ఎంపిక చేశామన్నారు. ఓటింగ్‌కు వచ్చేవారి  ఫొటో స్కాన్‌ చేసిన తర్వాత పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌, ఎపిక్‌ నంబర్‌, వార్డులోని ఓటర్‌ క్రమ సంఖ్య ను నమోదు చేస్తారు. ఇందులో ఆ ఓటరుకు ఒక్కటే ఓటు ఉందా.. ? ఇంకా ఎన్ని ఓట్లున్నాయనేది తెలుస్తుందన్నారు. ఒకచోట ఓటు వేసిన తర్వాత మరోచోట ఓటు వేయకుండా అరికట్టడం జరుగుతుందన్నారు. ఓటరు న మోదు సమయంలో నేరుగా ఫొటో దిగకుండా స్కా నిం గ్‌ చేసి నమోదు చేసుకున్న వారి గుర్తింపు కార్డులను డిటె క్ట్‌ చేస్తుందన్నారు. అలా అయినంత మాత్రాన ఇబ్బందులు పడొద్దని, రైన ఐడీ కార్డులను సంబంధిత పోలింగ్‌ అధికారికి సమర్పించిన తర్వాత ఓటు వేసే వెసలు బాటును కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ యాప్‌ గురించి పూర్తిగా తెలుసుకుని, ఏమైనా పొరపా ట్లు ఉంటే సరిచేసి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొంపల్లి మున్సిపాలిటీలోని 7,14వ వార్డులో ఒకటి,8,11,12,16వ వార్డు ల్లో రెండు చొప్పన మొత్తం 10పోలింగ్‌ కేంద్రాల్లో  పేస్‌ రికగ్నీషన్‌ యాప్‌ను ఉపయోగిస్తారు. ప్రతి పోలింగ్‌ కేం ద్రంలో ఒక కొత్త మొబైల్‌ ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు. మొత్తం 7007మంది ఓటర్ల వివరాలను సేకరిస్తారు. కార్యక్రమంలో ఆర్డీఓ మల్లయ్య, కమిషనర్‌, సహాయ ఎన్నికలఅధికారి ఎంఎన్‌ఆర్‌ జ్యోతి, తహసీల్దా ర్లు భూపాల్‌, గౌరివత్సల, రిటర్నింగ్‌,  పోలింగ్‌ అధికారులు, కౌన్సిలర్‌ అభ్యర్థులు, ఏజెంట్లు, పాల్గొన్నారు.
logo