గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Jan 18, 2020 , 00:56:35

సిద్ధమైన ఉప్పుగూడ ఆర్‌యూబీ

సిద్ధమైన ఉప్పుగూడ ఆర్‌యూబీ


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/చార్మినార్‌ : ఉప్పుగూడ ఆర్‌యూబీ(రోడ్‌ అండ్‌ బ్రిడ్జ్‌) ఎట్టకేలకు పూర్తయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉన్నందున అది తొలిగిన తర్వాత దీనిని ట్రాఫిక్‌కు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఫుట్‌పాత్‌లు, సర్వీస్‌ రోడ్లుసహా ఈ ఆర్‌యూబీ నిర్మాణానికి రూ.20.27కోట్లు వెచ్చించా రు. ఉప్పుగూడ వద్ద రైల్వేగేటును దాటేందుకు వాహనదారులు గంటలకొద్ద్దీ వేచివుండాల్సిన పరిస్థితి ఉండడంతో 2007లో అప్పటి ప్రభుత్వం ఆర్‌యూబీ నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేసింది. భూసేకరణలో సమస్యలు, స్థానిక రాజకీయ కారణాల తో మాటిమాటికీ డిజైన్ల మార్పు, అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడం తదితర కారణాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. అంతేకాదు, మొగల్‌పుర, కందికల్‌వైపు మంచినీరు, మురుగునీటి పైప్‌లైన్లతోపాటు విద్యుత్‌ స్తంభా లు షిఫ్టింగ్‌ చేయాల్సిరావడంతో పనులు ఆలస్యమయ్యాయి. రైల్వేశాఖ రైల్వేలైను కింద బాక్స్‌ పోర్షన్‌ నిర్మా ణం 2015లో చేపట్టి మే 2016లో పూర్తి చేసింది. అనంతరం జీహెచ్‌ఎంసీ అధికారులు ఆప్రోచ్‌ల నిర్మాణం చేపట్టి గతేడాది డిసెంబర్‌లో పూర్తి చేశారు. సర్వీస్‌ రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణంతోపాటు ఆర్‌యూబీకి రంగులు వేసే పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రజారవాణ సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు మరింత అధునికమైన మార్గాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చంద్రయాణగుట్ట సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ పుష్యరాగం తెలిపారు. సర్కిల్‌ పరిధిలోని ఉప్పుగూడ ఆర్‌యూబీ మరింత సొగసులతో ప్రత్యేకంగా రూపొందించామన్నారు. ఈ ఆర్‌యూబీ అందుబాటులోకి వస్తే సమీప ప్రాంతాల్లోని ప్రజలకు సంతోష్‌నగర్‌తోపాటు డీఆర్‌డీఎల్‌ ప్రధాన మా ర్గం మరింత సులభంగా చేరుకోవచ్చని తెలిపారు. ఛత్రినాక, గౌలిపుర, లాల్‌దర్వాజా, లలితాబాగ్‌తోపాటు ఇతర ప్రాంతాల స్థానికులకు వేగవంతమైన రోడ్డు కనెక్టీవిటిని పొందనున్నారని తెలిపా రు.  గతంలో ఉప్పుగూడ ప్రాంతంలో నుంచి డీఆర్‌డీఎల్‌ మార్గంతోపాటు అరుంధతినగర్‌ కాలనీలకు వెళ్లడానికి వాహనదారులు ఉప్పుగూడ రైల్వేగేట్‌ వద్ద గం టల పాటు నిరీక్షణ చేసేవారని గుర్తు చేశారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతోపాటు లోకల్‌ రైళ్ల రాకపోకల వల్ల రైల్వేగేట్‌ ఎప్పు డు మూసివేసి ఉండేవారని తెలిపారు. వాహనదారుల కష్టాలను తొలగించడానికి జీహెచ్‌ఎంసీ ఉప్పుగూడ ఆర్‌యూబీని చేపట్టిందన్నారు. నగరంలోని ఇతర ఫ్లై ఓవర్‌లతోపాటు ఆర్‌యూబీల కంటే భిన్నంగా రూ పొందించడానికి ప్రయత్నించామన్నారు. ఆర్‌యూబీలో ప్రయాణిస్తున్న వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచడానికి ఇరువైపులా గ్రామీణ వాతావరణాలతోపాటు రాష్ట్ర ఉత్సవాలను ప్రతిబింబించేలా పెయింటింగ్‌లను పొందుపర్చామని తెలిపారు.

ఆర్‌యూబీ విశేషాలు....

- పరిపాలనా అనుమతి వచ్చింది- 10-08-2007
- ఆర్‌యూబీ కోసం అవసరమైన వరద నీటి టన్నెల్‌  నిర్మాణ వ్యయం రూ.5.97కోట్లు
- ఫుట్‌పాత్‌లు, సర్వీస్‌రోడ్డు నిర్మాణ వ్యయం రూ.5.18కోట్లు
- అప్రోచ్‌లుసహా మొత్తం పొడవు- 345మీటర్లు
- ఇరువైపులా బాక్స్‌ పోర్షన్‌(కవర్డ్‌ పోర్షన్‌)- 28మీటర్లు
- అప్రోచ్‌ల పొడవు (ఓపెన్‌ పోర్షన్‌)- 262.88మీటర్లు
- యూ-షేప్‌ రీటెయినింగ్‌ వాల్‌- 160.0 మీటర్లు
- క్యాంటీలీవర్‌ రీటెయినింగ్‌ వాల్‌- 102.88మీ
- ఆయూబీ మొత్తం వెలడ్పు- 11.5మీ, క్యారేజ్‌ వే- 7.5 మీ


logo
>>>>>>