సోమవారం 06 ఏప్రిల్ 2020
Medchal - Jan 15, 2020 , 03:11:45

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి .. : మంత్రి మల్లారెడ్డి

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి .. : మంత్రి మల్లారెడ్డి


మేడ్చల్‌ రూరల్‌ :టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, కాంగ్రెస్‌, టీడీపీల హయాంలో జరిగిన అభివృద్ధి సీఎం కేసీఆర్‌ సారధ్యంలో సాధ్యమైందని   మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 3, 4 వార్డులలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి పాల్గొన్నారు.  మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.  టీఆర్‌ఎస్‌ నేత రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి మల్లారెడ్డి అహర్నిశలు ప్రజల కోసం శ్రమిస్తున్నారని తెలిపారు. గులాబీ జెండా ఎగిరితే మున్సిపాలిటీల రూపురేఖలు మారిపోతాయని, కొత్త మున్సిపాలిటీల్లో అన్ని సౌకర్యాలు సమకూరాలంటే, సమస్యలు తొలగిపోవాలంటే అధికార టీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్‌రెడ్డి, రవిశంకర్‌, కాలనీవాసులు పాల్గొన్నారు.


logo