గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Jan 13, 2020 , 03:38:23

సంక్రాంతి పండుగకు 4940 అదనపు బస్సులు

సంక్రాంతి పండుగకు 4940 అదనపు బస్సులు
  • -తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు వెళ్లేలా ఏర్పాట్లు పూర్తి
  • -రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ వెల్లడి
  • -ప్రయాణికులతో కిటకిటలాడిన ఎంజీబీఎస్‌,జేబీఎస్‌
  • -సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌
  • -బోసిపోయిన నగరంలోని ప్రధాన రోడ్లు


సుల్తాన్‌బజార్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్ధం నగరం నుంచి తెలంగాణ,ఏపీ రాష్ర్టాలలోని వివిధ ప్రాంతాలకు 4940 అదనపు బస్సులను నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం ఎంజీబీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా ఉం డేలా ఎంజీబీఎస్‌లో రంగారెడ్డి,ఖమ్మం రీజియన్‌ల రీజనల్‌ మేనేజర్లు,డివిజనల్‌,డిపో మేనేజర్లతో పాటు 250 సిబ్బంది,జేబీఎస్‌లో కరీంనగర్‌ రీజియన్‌ ఆర్‌ఎంతో పాటు 200 మంది సిబ్బంది అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.ఎంజీబీస్‌,సీబీఎస్‌, జూబ్లీబస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఆరాంఘర్‌చౌరస్తా, లింగంపల్లి, చందానగర్‌, కెపీహెచ్‌బీ,ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, టెలిఫోన్‌ భవన్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు,ఎల్బీనగర్‌తో పాటు జంటనగరాలలోని వివిధ శివారు కాలనీలలో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి, అధీకృత టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్ల వద్ద నుంచి 622 ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎంజీబీఎస్‌లో 6 పాయింట్లలో మే హెల్ప్‌ యూ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామన్నారు. జంటనగరాలలో పలు ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే దారిలో ట్రాఫిక్‌ జామ్‌లను నియంత్రించేందుకు పోలీస్‌ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు.  

ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల కిటకిట.....

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులతో ఎంజీబీఎస్‌ కిటకిటలాడుతోంది. గతంలో నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి గమ్యస్థానాలకు వెళ్లాలంటే ఎంజీబీఎస్‌కు చేరుకోవాల్సిన పరిస్థితి ఉండేది.ప్రస్తుతం అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఎల్బీనగర్‌,కేపీహెచ్‌బీ,ఆరాంఘర్‌ చౌరస్తా పాయింట్ల నుంచే బస్సులను నడిపించడంతో ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికుల సౌకర్యార్ధం..అధికారుల నంబర్లు..

ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా రంగారెడ్డి రీజియన్‌ అధికారులు అన్ని ప్రధాన పాయింట్లలో అధికారులతో పటిష్ట చర్యలు చేపట్టారు.ప్రయాణికుల సౌకర్యార్ధం ఎంక్వయిరీ నెంబర్లు- ఎంజీబీఎస్‌-8330933419, 833093357, 83309 33532, జేబీఎస్‌-04027802203, జీడిమెట్ల ఏజెంట్‌- 98660 90717, అరాంఘర్‌ ఏజెంట్‌-9059500217, హబ్సిగూడ ఏజెంట్‌-9849641808, దిల్‌సుఖ్‌నగర్‌-040-23747297, కేపీహెచ్‌బి ఏజెంట్‌-9490484232, లింగంపల్లి ఏజెంట్‌-9949999162, మియాపూర్‌ ఎక్స్‌రోడ్‌ ఏజెంట్‌-9248008595, చందానగర్‌ ఏజెంట్‌-8885055674, 9666664248, ఈసీఐయల్‌ ఏజెంట్‌-986627 0709, ఎస్‌ఆర్‌నగర్‌ ఏజెంట్‌-9866933312, అమీర్‌పేట్‌ ఏజెంట్‌-994995 875 8, టెలిఫోన్‌ భవన్‌ ఏజెంట్‌-9392333332, ఐటీఎం/ఏపీఎస్‌ ఆర్టీసీ-9100948 191, 9100948296 నంబర్లలో సమాచారం తెలుసుకోవచ్చన్నారు.


logo