మంగళవారం 31 మార్చి 2020
Medchal - Jan 13, 2020 , 03:27:19

దునియా మొత్తం ధూల్‌పేట పతంగులే..!

దునియా మొత్తం ధూల్‌పేట పతంగులే..!-జనవరిలో దొరికే పతంగులు చాలా ప్రత్యేకం
-దాదాపు 250 దుకాణాల్లో విక్రయాలు
-ఇక్కడ రెండించుల నుంచి 4 మీటర్ల వరకు లభ్యం
-సంక్రాంతికి ముందు జోరుగా అమ్మకాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పతంగుల పండగ రానే వచ్చింది. చిన్నారుల నుంచి యువత వరకూ ఎంతో ఉత్సాహంగా ఆడే ఆట పతంగుల పండుగ. సం క్రాంతి వచ్చిందంటే చాలు కొత్త కొత్త పతంగులు గాల్లోకి ఎగురుతాయి. సంక్రాంతి అనే కాదు ఈ సీజన్‌లో కులమతాలకు సంబంధం లేకుండా అందరూ పతంగులను ఎగరేస్తూ పండుగ వాతావరణాన్ని అనుభవిస్తారు. నగరంలో అన్నిచోట్లా పతంగు లు దుకాణాల్లో దొరుకుతాయి. కానీ నగరంలో గాలిపటం ప్రియులకు మంచి గాలిపటాలు దొరకాలంటే వాటికి అడ్డాగా ధూల్‌పేటనే చెప్పవచ్చు. ఈ దూల్‌పేటలో దొరికే రకరకాల పతంగుల కోసం నగరంలోనే కాకుండా పక్కజిల్లాల యువత కూడా ధూల్‌ పేటకు వస్తుంటారు. నగరంలో సంవత్సరం అంతా పతంగులు దొరికినా జనవరిలో దొరికే పతంగులు చాలా ప్రత్యేకంగా ఉం టాయి. ధూల్‌పేటలో అతి చిన్న రెండించుల పతంగి నుంచి 4 మీటర్ల పెద్ద పెద్ద పతంగులు కూడా దొరుకుతాయి. ధూల్‌పేటలో నగరం మొత్తానికి అమ్మడానికి దృష్టిలో ఉంచుకుని అనేక మంది వ్యాపారులు దాదాపు 250 చిన్నా పెద్దా దుకాణాలను నిర్వహిస్తారు. ఈ పతంగులను రకరకాల తక్కువ బరువు ఉండే పేపర్లను వాడి తయారు చేస్తారు.

అలాగే తక్కువ బరువుతోపాటు వంగే గుణం ఉండి త్వరగా విరగని సన్నని వెదురుబద్దలను గాలిపటం తయారీలో ఉపయోగిస్తారు. ఈ గాలిపటాలను అక్టోబర్‌, నవంబర్‌ నుంచే తయారు చేయడం మొదలు పెడతారు పతంగ్‌ కార్మికులు. ఈకాలంలోనే గాలిపటాలు ఎగరేయడానికి ఉన్న శాస్త్రీయ కారణం ఈ సమయంలో మాత్రమే గాలి ఒక పద్ధతిగా వీస్తుంది. ఒకే వైపు ఎక్కువ సేపు ఆటుపోట్లు లేకుండా సాధారణంగా గాలి అనువుగా వీయడమే దీనికి కారణం. ప్రస్తుతం నగరంలో తక్కువ ధరకు మంచి పతంగులు దొరికే ధూల్‌పేటలో రూ.2 నుంచి రూ.200 పైన ధర వరకూ దొరుకుతున్నాయి. సంక్రాంతికి ముందు అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఒక్కో దుకాణంలో సగటున 5 వేల నుంచి 10 వేల వరకూ గాలిపటాల అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. ఇక మాంజాలు కూడా 900 మీటర్లకు రకాన్ని బట్టి రూ.40 నుంచి రూ. 200 వరకూ అమ్ముడుపోతాయి. ఈ మాంజాలు సాధారణంగా కాటన్‌తో తయారు చేస్తారు.

ప్రమాదాలకు ఆస్కారం...

గాలిపటాలు ఎగరేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాపారులు ఎక్కువ ధరలకు మాంజాను అమ్ముకునే ఉద్దేశంతో సీసంవంటి ప్రమాదకర పదార్థాలను ధారానికి పూసి ఇది తగలగానే ఇతరుల ధారం తెగేలా గట్టిగా తయారు చేస్తారు. పతంగ్‌ ఎగరేసేందుకు ఉపయోగించే ఈ మాంజా ధా రం కాకుండా సాధారణ మొత్తని ధారం వాడాలని అంటున్నారు. కారణం మాంజాతో ఎగరేసినపుడు పొరపాటున వేలు కోసుకుపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు ఇతరులకు కూడా ఈ మాంజాతో అపాయాలు తప్పవంటున్నారు.  పక్షులు ప్రమాదక ర మాంజాతో గాయాలపాలై చనిపోయే ప్రమాదముందని ప్రభు త్వం కూడా  తయారీదారులకు నిబంధనలను విధించింది.

వెరైటీ పతంగులు...

తయారీదారులు పతంగ్‌ ప్రియులను ఆకర్షించేందుకు రకరకాల వెరైటీలను తయారు చేస్తారు. చిన్నారుల నుంచి యువకులు, రాజకీయ ఆసక్తి ఉన్నవారు, చివరకు ప్రేమను వ్యక్త పర్చేందుకు కూడా సహాయపడే పతంగులను తయారు చేస్తారు. వీటితోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు కూడా తయారు చేసి మార్కెట్లోకి తెస్తున్నారు. ఇక చిన్నారులకు ఎం తో ఇష్టమయ్యే కార్టూన్లలోని పాత్రలు అయిన చోటా భీం, మిస్టర్‌బీన్‌, అనేక క్యారెక్టర్లను కూడా పతంగులపై చిత్రీకరిం చి తయారు చేస్తారు. ప్రస్తుతం నగరంలో పేపర్‌ పతంగులకంటే ప్రింటెడ్‌ కవర్‌ పతంగులకు ఎక్కువగా డిమాండ్‌ ఉం ది. ఈ పేపర్లలో కూడా సింగిల్‌ పంట్‌, డబుల్‌ పంట్‌, ఆఫ్‌ పంట్‌ వంటి రకరకాల పేపర్లతో పతంగులను తయారు చేస్తారు. వీటితోపాటు ఈ సారి జోమోటో, స్విగ్గీ వంటివి కూడా పతంగులపై కనపడుతున్నాయి. దీంతోపాటు పలు కంపెనీలు తమ పబ్లిసిటీలో భాగంగా వారి కంపనీల పేర్లు కనపడేలా పతంగులను మార్కెట్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అన్నింటా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ చిత్రాలతో ఉన్న పతంగులకు కూడా మంచి డిమాండ్‌ ఉంది.


logo
>>>>>>