సోమవారం 06 ఏప్రిల్ 2020
Medchal - Jan 12, 2020 , 01:32:25

దుండిగల్‌ స్క్రూట్నీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

దుండిగల్‌ స్క్రూట్నీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌


దుండిగల్‌, నమస్తేతెలంగాణ: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, దుండిగల్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని శనివారం సాయంత్రం కలెక్టర్‌ డా. ఎంవీ.రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్క్రూట్నీ కేంద్రాలను పరిశీలించి, రిటర్నింగ్‌ అధికారులతో సమావేశమైయ్యా రు. దాఖలైన నామినేషన్లు, తిరస్కరణ గురైన నామినేష్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మల్లయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌, తహసీల్దార్‌ భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


logo