మంగళవారం 31 మార్చి 2020
Medchal - Jan 12, 2020 , 01:10:34

ఎన్నికలేవైనా గెలుపు కారుదే

ఎన్నికలేవైనా గెలుపు కారుదే
  • -తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
  • -నాణ్యమైన రహదారులు, మెరుగైన రవాణా వ్యవస్థ
  • -రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 90శాతం పట్టణీకరణ
  • -రెండు జిల్లాల్లో 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు
  • -పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశా నిర్దేశంతో ప్రచారం

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఏ ప్రాంతమైన అభివృద్ధి సాధించాలంటే మౌలిక సదుపాయాల కల్పన ప్రధానం. జనాభా, విస్తరణ చూస్తే హైదరాబాద్‌ మహానగర బృహత్తర ప్రణాళిక, అమలు.. అనివార్యం. దీన్ని గుర్తించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 20ఏండ్లకు సరిపడా అభివృద్ధి వ్యూ హరచనను సిద్ధం చేసింది. ఈ మేరకు అమలులో నిమగ్నమైం ది. పలు ప్రాజెక్టులు పురోగతిలో ఉండగా, మరికొన్ని త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. అవసరాలకు తగ్గట్లుగా భూకేటాయింపులు, రహదారులు, తాగునీరు, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, నీటివనరుల పరిరక్షణ.. ఒక్కటేమిటి? సకల సౌకర్యాలను కల్పించేందుకు అడుగులు వేస్తోంది. ఆర్థికమాంధ్యం వెం టాడుతున్నా.. ప్రజావసరాలు, మెరుగైన వ్యవస్థల రూపకల్పనల కోసం ప్రాజెక్టులను అమలు చేస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాల్లో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. రాను న్న రోజుల్లో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే మెరుగైన జీవనం, ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఢోకా లేదు. హెచ్‌ఎండీఏ ప్రాం తాల్లో ఎన్నెన్నో ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ప్రాంతంలో సందర్శించినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పనులు,ప్రాజెక్టులు దర్శనమిస్తాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలు జరిగే మున్సిపల్‌, కార్పొరేషన్లను అభివృద్ధి పథాన నడిపిస్తోన్న కేటీఆర్‌ ఆ శాఖకు మంత్రి కూడా కావడంతో ప్రచా రం కొట్టిన పిండికానుంది. చేపట్టిన ప్రతి పనీ కంఠస్థమే. ప్రతి ప్రాజెక్టుపై సమగ్ర అవగాహన ఉంది. ప్రతి ప్రాంతంలోనూ పర్యటించిన అనుభవం ఉంది. ప్రతి పట్టణ నాయకత్వంతో ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి. అందుకే ఈ దఫా మున్సిపల్‌/కార్పొరేషన్ల ఎన్నికల్లో తాను చేపట్టిన, చేపట్టనున్న ప్రాజెక్టులు, పనులను ఓటర్లకు వివరించేందుకు ఎలాంటి అవరోధా లు కనిపించడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌ మహానగరం శివార్లలో ఈ ఆరేండ్లల్లో రూ.వేల కోట్లతో పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఇం కొన్ని త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.

అందుకే అభివృద్ధి, సంక్షే మం నినాదంతో ఎన్నికలకు వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణు లు సమాయత్తమవుతున్నాయి. రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఇబ్రహింపట్నం, షాద్‌నగర్‌, చేవెళ్ల, కల్వకుర్తి, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల పరిధిలోనే 21 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన ప్రచారాస్ర్తాలతో అనూహ్య ఫలితాలను సాధించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేశారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఢంకా భజాయించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నూ అవే ఫలితాలు పునరావృతం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 21 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో ఇప్పటికే గులాబీ దళం ప్రచారాన్ని మొదలు పెట్టింది.

ఏయే ప్రాంతాల్లో ప్రణాళిక

బృహత్తర ప్రణాళికతో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌, యాదా ద్రి జిల్లాల రూపురేఖలే మారనున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి, మొయినాబాద్‌, చేవెళ్ల, షాబాద్‌, కందుకూరు, మహేశ్వరం, హయత్‌నగర్‌, శంషాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం, ఇబ్రహీంపట్నం, గండిపేట, షాద్‌నగర్‌, మేడ్చల్‌ జిల్లాలో మేడ్చల్‌, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్‌, సంగారెడ్డి జిల్లాలో రామచంద్రాపురం, పటాన్‌చెరు, యాదాద్రి జిల్లాలో చౌటుప్పల్‌, బీబీనగర్‌, భువనగిరి, పోచంపల్లి మండలాలకు ఎంతో మేలు కలగనున్నది. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌, అటవీ శాఖలు అనేక పనులు చేపట్టాయి.

కోతల్లేని విద్యుత్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషితో సమకూరిన 24 గం టల విద్యుత్‌ సరఫరాతో ఉపాధి పెరిగింది. ఉత్పాదక సామర్థ్యం పెరిగింది. జీడిమెట్ల, కాటేదాన్‌, బాలానగర్‌, సనత్‌నగర్‌, ఉప్పల్‌, చర్లపల్లి.. పారిశ్రామికవాడల్లో ఉత్పాదక సామర్థ్ధ్యపు పెం పు తో అనేక పరిశ్రమలు విస్తరించాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. మూడు షిఫ్టులా పని చేస్తూ మేడ్‌ ఇన్‌ తెలంగాణ బ్రాండ్లను విశ్వవ్యాపితం చేస్తున్నారు. ఇప్పుడ పారిశ్రామిక విస్తరణ నడుస్తోంది. ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, శంషాబాద్‌, షాద్‌నగర్‌, శంకర్‌పల్లి, మేడ్చల్‌, జవహర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. టీఎస్‌ఐపాస్‌తో ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. దాంతో ఐటీ, ఐటీ ఆధారితంతోపాటు అనేక రకాల పరిశ్రమలు కొత్తగా వస్తున్నాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రధానంగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు, చూపిన చొరవతో అనేకమంది పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌ వైపు అడుగులు వేస్తున్నారు.

అభివృద్ధి నినాదం

ఏ ఎన్నికలైనా ఓటర్లు అభివృద్ధినే ఆకాంక్షిస్తున్నారు. ఐతే ఈ ఆరేండ్లలో జరిగిన అభివృద్ధి పనులు కళ్ల ఎదుట కనిపిస్తుండడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగేలేదని నాయకత్వం భావిస్తోంది. ప్రతి వార్డు, కాలనీలో ఏదో ఒకటైనా ప్రభుత్వం చేపట్టిన పని దర్శనమిస్తున్నది. మెరుగైన జీవన విధానానికి కావాల్సిన పనులన్నీ చేపట్టారు. అన్ని రంగాలు, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనులు చేపట్టింది. వాటినే ప్రచారాస్ర్తాలుగా తీసుకెళ్లేందుకు నాయకత్వం సిద్ధమైంది. ఓటరు కోణంలో, ఓట రు కోరుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ నినాదంతోనే పార్టీ ముం దుకెళ్లడానికి సమాయత్తమవుతోంది. కాం గ్రెస్‌, బీజేపీలకు టీఆర్‌ఎస్‌ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించే ఎజెండా, అంశాలేవీ దొరకడం లేదని సమాచారం. వ్యక్తిగత విమర్శలు మినహా ప్రభుత్వం చేపట్టిన పనులను, ప్రణాళికను విమర్శించేందుకు అవకాశం లేకపోవడం గమనార్హం. అందుకే గెలుపు సునాయసమేనని టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.


logo
>>>>>>