గురువారం 29 అక్టోబర్ 2020
Medchal - Sep 12, 2020 , 03:34:30

ఆన్‌లైన్‌ క్లాసుల పర్యవేక్షణకు10 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

ఆన్‌లైన్‌ క్లాసుల పర్యవేక్షణకు10 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : ఆన్‌లైన్‌ క్లాసులను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ, పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరుగుతున్న ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు 100శాతం హాజరు అవుతున్నారా ? విద్యార్థులకు టీవీ, స్మార్ట్‌ ఫోన్‌లు ఉన్నాయా ? ఆన్‌లైన్‌లో పాఠాలలో భాగంగా అధ్యాపకులు విద్యార్థులకు ఇచ్చిన వర్క్‌షీట్స్‌ ఏ మేరకు రాస్తున్నారు ? అనే అంశాలపై ఈ టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారని జిల్లా విద్యాధికారిణి ఐ.విజయకుమారి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. రెగ్యులర్‌గా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కాకుండ ఎగ్జామినేషన్‌, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే జిల్లాలో ఒక్కో బృందంలో ముగ్గురు అధికారుల చొప్పున మొత్తం 10బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.