e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి అర్హులకే పథకాలు అందేలా చర్యలు

అర్హులకే పథకాలు అందేలా చర్యలు

అర్హులకే పథకాలు అందేలా చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. ఆదివారం జీడిమెట్ల డివిజన్‌ పరిధిలో ని పేట్‌ బషీరాబాద్‌ క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి చెందిన ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పలు సమస్యలపై వచ్చిన వారికి ఆయా విభాగాల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంక్షేమ సంఘాలు సహకరించాలని, అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలుగకుండా సాఫీగా సాగేలా చూడా లని సూచించారు.కార్యక్రమంలో ఆయా కాలనీల సంక్షే మ సంఘాల ప్రతినిధులు, ప్రజలు ఉన్నారు.

చిత్తారమ్మ,పోచమ్మ ఆలయ ముఖద్వారం ప్రారంభం

కుత్బుల్లాపూర్‌ 131 డివిజన్‌ పరిధిలోని పద్మానగర్‌ ఫేజ్‌-2లో ఉన్న చిత్తారమ్మ, పోచమ్మ ఆలయం ఎదుట నూతనంగా నిర్మించిన ముఖద్వారం, ఉత్సవ మండపాన్ని ఆదివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌, మేడ్చల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి, భరత్‌సింహారెడ్డి, ఆలయ మరమ్మతుల దాత బీఆర్‌ విశాల్‌తో పాటు ఆలయ కమిటీ చైర్మన్‌ ఎం.యాదగిరి, జే.నర్సింహ, సీహెచ్‌.మురళీకృష్ణ, రాములు, కాలనీవాసులు పాల్గొన్నారు.

అనాథ పిల్లలకు అండగా ఉంటాం..

- Advertisement -

అనాథ పిల్లలకు అండగా ఉంటామని ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్‌ మగ్ధ్దూంనగర్‌లో నివాసం ఉంటున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్త వెంకటరమణ కరోనాతో ఇటీవల మృతి చెందాడు. అయితే గతంలో ఆయన కూతురు వరకట్న వేధింపులతో మృతి చెందడంతో మనవరాలు ఆయన దగ్గరే ఉండేది. ఈ క్రమంలో ఆరేండ్ల పాప అనాథగా మారింది. మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా ఆదివారం ఆ పాపకు రూ.5 లక్షల చెక్కును ఎమ్మెల్యేలు అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆడ పిల్లలను చదివించే బాధ్యత నుంచి వివాహం జరిగే వరకు తమ వంతు సహాయసహకారాలు అందజేస్తామన్నారు.కార్యక్రమం లో కార్పొరేటర్లు జగన్‌, సత్యనారాయణ, శేషగిరిరావు, నాయకులు రాజేశ్‌, సయ్యద్‌ రశీద్‌, సాజీద్‌, మార య్య, అశోక్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అర్హులకే పథకాలు అందేలా చర్యలు
అర్హులకే పథకాలు అందేలా చర్యలు
అర్హులకే పథకాలు అందేలా చర్యలు

ట్రెండింగ్‌

Advertisement