నమస్తే తెలంగాణ, నెట్: అన్నదాతలు వైభవంగా జరుపుకొనే పండుగ ఏరువాక పౌర్ణమి. ఈ రోజే వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. వర్ష రుతువు ప్రారంభం కావడంతో గురువారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైతులు ఏరువాక పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఎద్దుల కొమ్ములకు రంగుల పూసి, బెలూన్లు, రిబ్బన్లతో అందంగా ముస్తాబు చేసి మంగళ హారతులు ఇచ్చి పూజలు చేశారు. గ్రామాల్లోని ఆలయాల చుట్టూ ఎడ్ల బండ్ల ఊరేగింపు నిర్వహించారు. పుడమితల్లిని పూజిస్తూ రైతులు తమ పొలాల్లో భూమి పూజలు చేసుకుని ఏరువాక సాగరో అంటూ సంబురంగా వ్యవసాయ పనులను ప్రారంభించారు.