e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home మెదక్ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి

రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి

  • జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షి షా

హీరాబాద్‌,ఆగస్టు 3: రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేలా అధికారులు, ప్రజాపతినిధులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. మంగళవారం జహీరాబాద్‌ మండలంలోని గోవింద్‌పూర్‌ గ్రామ శివారులో జహీరాబాద్‌-చించొళి రోడ్డుకు ఇరువైపులా బహువరుసల రెవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటారు. ప్రభుత్వం హరితహారంలో మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యత కలిపిస్తుందన్నారు. ఆకు పచ్చని తెలంగాణ చేసేందుకు ప్రభుత్వం హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈవో ఎల్లయ్య, డీఆర్‌డీవో శ్రీనివాస్‌రావు, ఏపీడీ జయదేవ్‌ ఆర్య, ఎంపీడీవో రాములు, ఎంపీవో మహేశ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -

పచ్చదనాన్ని మరింత పెంచాలి
కోహీర్‌, ఆగస్టు 3: ప్రజలకు స్వచ్ఛమైన గాలి లభించేందుకు పచ్చదనాన్ని మరింత పెంచాలని అదనపు కలెక్టర్‌ రాజర్షి షా మండల అధికారులను కోరారు. మంగళవారం కోహీర్‌, కవేలి గ్రామ ప్రధాన రహదారి పక్కన చేపట్టిన మల్టీలేయర్‌ హరితహారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవేలి నుంచి కోహీర్‌, బిలాల్‌పూర్‌ గ్రామ శివారు వరకు ఉన్న ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలను నాటాలని కోరారు. రెండో వరుసలో నాటుతున్న పూల మొక్కల మధ్య దూరం ఐదు మీటర్లు ఉందని ఇంత దూరం అవసరం లేదని చెప్పారు. రెండు మొక్కల మధ్య మరో మొక్కను నాటాలని సూచించారు. స్థలాన్ని వృథా చేయొద్దన్నారు. వాహనదారులు, ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచేలా మొక్కలను నాటాలన్నారు. వాటి సంరక్షణకు ప్రత్యేకంగా కార్మికులను నియమించాలన్నారు. మొక్కల ఎదుగుదలకు సకాలంలో నీటిని సరఫరా చేయాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం ఏ దశకు వచ్చిందని ఎంపీపీ మాధవిని అడిగారు. పనులు వేగంగా జరుగుతున్నాయా లేదా అన్నారు. పను లు కొనసాగుతున్నాయని ఎంపీపీ బదులిచ్చారు. ఆయన వెంట డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, జడ్పీ సీసీవో ఎల్లయ్య, జడ్పీటీసీ రాందాస్‌, ఎంపీడీవో సుజాతనాయక్‌, ఎంపీవో వెంకట్‌రెడ్డి, సర్పంచులు జగదీశ్వర్‌రెడ్డి, నర్సింహు లు, అతియాజావీద్‌, ఏపీవో సునందరావు, కార్యదర్శులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana