జంతువుల నుంచి మానవులకు సోకే వ్యాధులు..జూనోసిస్ అనగా జంతువుల నుంచి మనషులకు సోకే వ్యాధి. జూనోసిస్ అనే పదం గ్రీకుభాష నుంచి ఆవిర్భవించింది. ప్రకృతిలో మానవులు, జంతువులకు కలిగే వ్యాధులను జూనోసిస్ లేదా సంక్రమిత వ్యాధులంటారు.
1885లో జూలై 6 లూయిస్ పాశ్ఛర్ అనే శాస్త్రవేత మొదటిసారిగా ప్రాణంతకవ్యాధి అయిన పిచ్చి కుక్కల కాటుతో వచ్చే ‘రేబీస్’కి టీకా మందును మనుషులకు విజయవంతంగా ఇచ్చాడు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవంగా నిర్వహించుకుంటారు. ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ సుమారు 150 పైగా ఈ జూనోటిక్ వ్యాధులున్నాయి. ఈ వ్యాధులను కలుగచేసే క్రిములను బట్టి వైరల్ జూనోసిస్ అని అలాగే బ్యాక్టీరియల్, ప్రొటో జోవన్ ఫంగల్, అంతర, బాహ్యపరాన్న జీవులు ద్వారా కలిగే జూనోసిస్
అంటారు.
వైరస్ ద్వారా వచ్చేవి :
ఆవులు, గొర్రెలు, మేకల్లో మశూచి, మెదడు వాపు,
రెబీస్ (పిచ్చికుక్క కాటు), బర్డ్‌ఫ్లూ వంటివ్యాధులు ప్రబలుతాయి.
బ్యాక్టీరియ ద్వారా వచ్చేవి :
ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్, క్షయ (టీబీ), ధనుర్వాతం,
సాల్మనెల్లోసిస్ (విషహారం), లెప్టో స్పైరోసిస్ మొదలగునవి.
ప్రొటోజోవా ద్వారా వచ్చేవి :
వీటిలో అమీబియాసిస్ (బంక విరేచనాలు), గియార్డియోసిస్, టాక్సప్లాస్మోసిస్, బాలంటిడియోసిస్, నల్లజ్వరం (కాలా అజార్) మొదలైనవి.
ఫంగల్ జూనోసిస్ :
ఈ వ్యాధుల్లో తామర, క్యాడిడియోసిస్ మొదలైనవి.
పరాన్నజీవుల ద్వారా కలిగే జూనోసిస్ :
ఉదా : టీనియాసిస్, ఐఖేనో కోసిస్, ఫైలేరియాసిస్, ఫేషియోలియోసిస్, సిస్టోసోమియాసిస్, ట్రేకోస్టాంగులోసిస్ మొదలైనవి.
బాహ్యపరాన్న జీవుల ద్వారా కలిగే జూనోసిస్ : వీటిలో గజ్జి ముఖ్యమైనది.
పశువులు (గోజాతి, గేదె జాతి) : ఆంత్రాక్స్, గాలికుంటు, గొంతువాపు, మశూచి, క్షయ, బ్రూసెల్లోసిస్
కుక్కలు : పిచ్చికుక్క కాటు, లేప్టోస్పైరోసిస్,హైడాటిడోసిస్
మేకలు, గొర్రెల : ధనుర్వాతం, లేప్టోస్పైరోసిస్, గ్లాండర్
గుర్రాలు : ధనుర్వాతం, లేప్ట్రోస్పైరోసిస్, గ్లాండర్
పందులు : మెదడు వాపు, ట్కెనోసిస్, ఇన్ఫ్లూయన్జా, రేమీస్, ఆంథ్రాక్స్, సాల్మోనెసిస్, లేప్టోస్పైరోసిస్, వెసిక్యూలార్ స్టోమటైటిస్, టీనియాసిస్, ఎకైనోకోకస్ కోళ్లు/ పక్షులు : మెదడు వాపు, కొక్కెర, బర్డ్‌ఫ్లూ, ఫౌల్ కలరా, సాల్మోనెల్లోసిస్, చిలుకల ద్వారా సిట్టకోసిస్.
జూనోసిస్ వ్యాధులు రాకుండా..
జూనోసిస్ వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు టీకా మందులు వేయించుకోవాలి.
వ్యాధి సోకిన పశువులు, పక్షుల మంద నుంచి వేరు చేసి వెంటనే చికిత్స చేయించాలి.
పశుపక్ష్యాదులను ఉంచే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలను అడవిలో మేతకు పంపకపోవడం మంచిది. దీంతో అడవి జంతువుల నుంచి వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు.
దోమలను అరికట్టేందుకు ఇంటి, పశువుల షెడ్ల చుట్టూ పక్కల నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
పశుపక్ష్యాదులతో జాగ్రతలు మంచివి..
నిత్యం మనం పశుపక్ష్యాధులతో సమయం కేటాయిస్తున్నప్పుడు చేతుల శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇండ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లులు, గుర్రాలు, కుందేళ్లు తదితర జంతువులకు వెటర్నరీ వైద్యుల సలహాలతో ప్రతి సంవత్సరం టీకాలను వేయించాలి. కొన్ని టీకాలు మూడు, ఆరునెలలకో సారి వేయించే టీకాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు టీకాలు వేయించడం మంచిది. కుక్క, పిల్లుల కాటుకు దూరంగా ఉండాలి. పశుపోషణ చేసుకునే గొర్రెలు, మేకలు, తెల్ల, నల్ల జాతి పశువులకు ప్రభుత్వం ద్వారా వెటర్నరీ వైద్యులు ఇచ్చే టీకాలు, మందులు క్రమం తప్పకుండా వేయించాలి. కుక్క, పిల్లులు కాటు వేస్తే వెంటనే వైద్యుల సలహాలతో వ్యాక్సినేషన్ చేయించుకోవాలి.