e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home జిల్లాలు Narsapur |బృహత్‌ పల్లెప్రకృతి వనంతో ఆహ్లాదకర వాతావరణం

Narsapur |బృహత్‌ పల్లెప్రకృతి వనంతో ఆహ్లాదకర వాతావరణం

నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి

నర్సాపూర్‌ : పల్లెప్రకృతి వనంతో ఆహ్లాదకర వాతావరణం చేకూరుతుందని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పెద్దచింతకుంట గ్రామంలో సర్పంచ్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో బృహత్‌ పల్లె ప్రకృతివనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక నిధులతో 10 ఎకరాల స్థలంలో బృహత్‌ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

గ్రామస్తులతోపాటు నర్సాపూర్‌ పట్టణవాసులు, ఇతర గ్రామాల ప్రజలు సేదతీరేందుకు ఈ పల్లెప్రకృతి వనం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, గ్రామ సర్పంచ్‌ శివకుమార్‌, ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ నర్సింగరావు, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌, ఏఎంసీ డైరెక్టర్‌ రావూఫ్‌, ఎంపీడీవో మార్టిన్‌ లూథర్‌, ఏఎంసీ వైస్ చైర్మన్‌ హబీబ్‌ఖాన్‌, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana