టీఆర్‌ఎస్‌తోనే పండుగలకు ప్రాధాన్యం

రాయికోడ్‌, మే 11 :టీఆర్‌ఎస్‌తోనే పండుగలకు ప్రా ధాన్యత లభిస్తున్నదని జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్‌ అన్నారు. మంగళవారం రాయికోడ్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ముస్లింలకు రంజాన్‌ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ 215 మంది ముస్లింలకు రంజాన్‌ తోఫాలను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ విఠల్‌, ఆర్‌ఐ ప్రభాకర్‌ పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి సర్కారు కృషి
టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంజీవరావు
సిర్గాపూర్‌, మే 11 : రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సర్కారు కృషి చేస్తున్నదని సిర్గాపూర్‌ మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సంజీవరావుపాటిల్‌ అన్నారు. సిర్గాపూర్‌లో ముస్లింలకు రంజాన్‌ తోఫాలను అందజేశారు. మం డల పరిధిలోని ఖాజాపూర్‌లో మండల కో-ఆప్షన్‌ సభ్యు డు బషీరుద్దీన్‌ ముస్లి ంలకు తోఫాలను అందజేశా రు. కార్యక్రమంలో వీఆర్వో ఆగమయ్య, టీఆర్‌ఎస్‌ నాయకు లు యాదవరావుపాటిల్‌, ఆసీఫ్‌, ఆషిక్‌, వసీం, రహీం, మక్సూ ద్‌, జబ్బర్‌, మహిళలు పాల్గొన్నారు.
కంగ్టిలో..
కంగ్టి, మే 11 : కంగ్టిలోని తహసీల్దార్‌ కార్యాలయం లో ముస్లింలకు రంజాన్‌ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ నాగారాజు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సంతోశ్‌రావు ముస్లింలకు తోఫాలను అందజేశారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఆహ్మద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్‌లో…
హత్నూర, మే 11 : మండలంలోని దౌల్తాబాద్‌లో ముస్లిం సోదరులకు రంజాన్‌ తోఫాలను టీఆర్‌ఎస్‌ నాయ కులు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అజీస్‌, గౌస్‌, రఫీషా తదితరులు పాల్గొన్నారు.