మెదక్ మున్సిపాలిటీ, జూలై 24 : మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే గురుకుల జూనియర్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల కో ఆర్డినేటర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. శనివారం హవేళిఘనపూర్‌లో మహాత్మా గురుకుల విద్యాలయంలో జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ అధ్యక్షతన పరీక్ష కేం ద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు, అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణమూర్తి పలు సూచనలు చేశారు. ఉద యం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గం టల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులను గంటముందు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతిక ధూరం పాటించాలన్నారు. వెబ్సైట్లో హాల్‌టికెట్ డౌన్లోడ్ సమస్య ఉంటే 040-2332 8266 నంబర్‌ను సంప్రదించాలన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో 160 మంది విద్యార్థుల చొప్పున 8 కేంద్రాల్లో 1280 మంది పరీక్షకు హాజరవుతారన్నారు. సమావేశంలో జిల్లా పరీక్షల అధికారి భాస్కర్, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, అబ్జర్వర్లు, రూట్ అధికారులు పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
-సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్
సిద్దిపేట టౌన్, జూలై 24 : మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ చెప్పారు. ప్రవేశ పరీక్ష ఆదివారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని 8 పరీక్షా కేంద్రాల్లో జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉం టుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్షా సెంటర్ల వద్ద నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడవద్దని చెప్పా రు. పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. పోలీసు అధికారులు పరీక్షల సమయంలో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. పరీక్షా సమయానికి కంటే గంట ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
పరీక్షా కేంద్రాలు
సిద్దిపేట ప్రభుత్వ బాలికల హైస్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్ ఇందిరానగర్, గవర్నమెం ట్ మల్టీపర్పస్ హైస్కూల్, ప్రభుత్వ ఉర్దూ మీడియం హైస్కూల్ నాసర్‌పుర, ప్రభుత్వ న్యూ హైస్కూల్, ప్రభుత్వ న్యూ హైస్కూల్ పారుపల్లి, గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ మోడల్ స్కూల్ ఇర్కోడు.