e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home మెదక్ గ్రామాలకూ బీ-పాస్‌

గ్రామాలకూ బీ-పాస్‌

  • పంచాయతీల్లో అక్రమ లే అవుట్లకు చెక్‌
  • పంచాయతీలకు టీఎస్‌ బీ-పాస్‌తో అనుసంధానం
  • లే అవుట్లు, ఇండ్ల నిర్మాణాలకు లింక్‌
  • పర్యవేక్షణకు జిల్లాస్థాయి కమిటీలు
గ్రామాలకూ బీ-పాస్‌

మెదక్‌ మున్సిపాలిటీ, జూన్‌ 18: గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వెలుస్తున్న లే అవుట్లను అడ్డుకునేందుకు టీఎస్‌ బీ-పాస్‌( తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ సిస్టం ఆన్‌ సెల్ఫ్‌ సర్టిఫికెషన్‌) పరిధిలోకి తీసుకోచ్చింది. మున్సిపల్‌ పాలన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం టీఎస్‌ బీ-పాస్‌ను తీసుకొచ్చింది. ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాలకు వర్తింపుజేస్తూ ఉత్తర్వులు జారీ చే సింది. గ్రామాల్లో లే అవుట్లు, ఇండ్ల నిర్మాణాల అనుమతి కోసం ఇకనుంచి టీఎస్‌ బీ-పాస్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈనెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో లే అవుట్లు, భవన నిర్మాణాలకు టీఎస్‌ బీ-పాస్‌ దరఖాస్తు చేసుకున్నట్లే.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

సులభంగా అనుమతులు…
టీఎస్‌ బీ-పాస్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత భవన నిర్మాణాల అనుమతి సులభంగా మారింది. గతం లో ఎవరైనా ఇళ్లు నిర్మించాలనుకుంటే మున్సిపాలిటీల్లో గుర్తింపు పొందిన లైసెన్స్‌ సర్వేయర్లతో దరఖాస్తు చేసుకునేవారు. ఈ విధానంలో నెలలు దాటిన అనుమతులు రాకపోయేవి. టీఎస్‌ బీ-పాస్‌ వచ్చిన తరువాత దరఖాస్తు దారుడికి కేవలం 21 రోజుల్లో అనుమతి ఇవ్వాల్సి వ స్తుంది. లేని పక్షంలో ఆన్‌లైన్‌లో అటోమెటిక్‌గా అనుమతి లభిస్తుంది.

- Advertisement -

కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ …
గ్రామీణ ప్రాంతాల్లోనూ టీఎస్‌ బీ-పాస్‌ అమలు చేయడంతో జిల్లాస్థాయి టాస్క్‌పోర్స్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. టీఎస్‌ బీ-పాస్‌ ద్వారా లేవుట్లు, భవన నిర్మాణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వాటిని పరిశీలించి అనుమతులు ఇవ్వడానికి కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీ తరపున టీపీవోలను(టౌన్‌ ప్లానింగ్‌ అధికారి), రెవెన్యూ శాఖ తరపున రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను సభ్యులుగా నియమిస్తారు. ఈ బృందాలకు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.

అక్రమ లే అవుట్లను అడ్డుకునేందుకే…
ముఖ్యంగా పట్టణాల శివారులోని గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లు, ఇండ్ల నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తాజాగా వీటిని టీఎస్‌ బీ-పాస్‌కు లింక్‌ చేసింది. జిల్లాలో 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. చాలా మంది అనుమతులు లేకుండా అక్రమ లే అవుట్లు చేసి వాటిని విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తు న్న ప్రజలు మోసపోతున్నారు. అలా చేస్తే అక్రమ లేఅవుట్లను రద్దు చేయడంతో పాటు ఇండ్ల నిర్మాణాకి అనుమతులు ఇవ్వరు.

అనుమతులు ఇలా..
ఇంటి నిర్మాణం కోసం ఇంటినుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో లేదా మీ సేవ, ఆన్‌లైన్‌ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటి నిర్మాణం చేసే వ్యక్తి tsbpass. telengana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి భవన నిర్మాణ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత స్థలం, సర్వేయర్‌ డాక్యుమెంటేషన్‌, భవన నిర్మాణ ప్లాన్‌, సెట్‌బ్యాక్‌ తదితర వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. ఈ డ్రాయింగ్‌ను సాఫ్ట్‌వేర్‌ నిబంధనల ప్రకారం ఉందా… లేదా అనేది ధ్రువీకరిస్తుంది. భవన నిర్మాణదారులు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సింగిల్‌విండో ద్వారా 21 రోజుల్లో అనుమతిస్తారు. భవన నిర్మాణానికి సంబంధించి పత్రాలు సక్రమంగా ఉంటేనే అనుమతి లభిస్తుంది. ఒక వేళ తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిస్తే మున్సిపల్‌ అధికారులకు ఆ భవనాన్ని కూల్చివేసే అవకాశాలున్నాయి. లే అవుట్ల కోసం సైతం ఇదే విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అక్రమాలకు అవకాశమే ఉండదు..
గ్రామీణ ప్రాంతాల్లోనూ లేఅవుట్లకు సంబంధించి, భవన నిర్మాణాలకు ఇక నుంచి నుంచి టీఎస్‌ బీ-పాస్‌తోఅనుమతి తీసుకోవా ల్సి ఉంటుంది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో టీఎస్‌ బీ-పాస్‌ విధానంతో భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. పూర్తి వివరాలు సక్రమంగా ఉంటేనే అనుమతులు వస్తాయి.
-శ్రీహరి, మున్సిపల్‌ కమిషనర్‌, మెదక్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్రామాలకూ బీ-పాస్‌
గ్రామాలకూ బీ-పాస్‌
గ్రామాలకూ బీ-పాస్‌

ట్రెండింగ్‌

Advertisement