e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home మెదక్ గొప్ప మనసున్న మహావ్యక్తి సీఎం కేసీఆర్‌

గొప్ప మనసున్న మహావ్యక్తి సీఎం కేసీఆర్‌

  • మెదక్‌ జిల్లాలో 26వేల మంది ఉద్యోగులకు మేలు
  • టీఎన్జీవో మెదక్‌ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌
గొప్ప మనసున్న మహావ్యక్తి సీఎం కేసీఆర్‌

మెదక్‌, జూన్‌ 9 : ఉద్యోగులకు పీఆర్సీ తదితర డిమాండ్లన్నింటినీ గొప్ప మనసుతో పరిష్కరించిన సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులు ఎప్పటికీ రుణపడి ఉంటారని టీఎన్జీవో మెదక్‌ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉద్యోగులు అంకితభావంతో, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పని చేస్తున్నందుకు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. రాబోయే కాలంలో మరింత అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తూ సీఎం కేసీఆర్‌ కలలుగన్న బంగారు తెలంగాణ సాధనకు మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ సర్కారు ఏడేండ్లుగా ఉద్యోగుల అనేక సమస్యలను పరిష్కరిస్తున్నదన్నారు. 30శాతం ఫిట్‌మెంట్‌తో మెదక్‌ జిల్లాలో దాదాపు 26వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా, ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా, టీఎన్జీవో సంఘం ఉద్యోగులను ఐక్యంగా ఉంచి ఫ్రెండ్లీ ప్రభుత్వంలో తప్పకుండా కేసీఆర్‌ నాయకత్వంలో ఉద్యోగుల ప్రతి సమస్య పరిష్కారమవుతుందన్నారు. దానికి ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల కార్యదర్శి రాజ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గొప్ప మనసున్న మహావ్యక్తి సీఎం కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement