మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 10 : ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారిగా అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ నియమితులయ్యారు. ఇప్పటి వరకు నోడల్ అధికారిగా విధులు నిర్వహించిన సూర్యప్రకాశ్ కంటె సత్యనారాయయణ సీనియర్ కావడంతో ఇంటర్ విద్యాశాఖ సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్‌కు వీడ్కోలు పలుకుతూ నూతన నోడల్ అధికారిని జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పూలమాలలతో సన్మానించారు.