మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 26: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని జడ్పీ చైర్పర్సన్ హేమలత అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని జడ్పీ కార్యాలయంలో ఆదివారంఆమె చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వాములపై, రజాకార్లపై పోరాడిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు.కార్యక్రమంలో జడ్పీ సీఈవో శైలేశ్, కార్యాలయ సూపరింటెండెంట్ మాణయ్య, ఎంపీడీవో లక్ష్మి, కార్యాలయ సిబ్బంది ధనుంజయ్, రూపేశ్, రంగరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో..
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, యువత కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శాంసన్ సందీప్, ప్రసాద్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ముజీబ్, విద్యార్థి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నోమెన్, కిరణ్, మున్సిపల్ కౌన్సిలర్ జయరాజ్, మాజీ కౌన్సిలర్ మంగ రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు మోచి కిషన్, జాయ్‌ముర్రే, మధు, జెల్ల రమేశ్, ప్రవీణ్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రజక సంఘం ఆధ్వర్యంలో…
రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులు, రజక సంఘం పట్టణ యువత అధ్యక్షుడు మల్లేశం, రజక సంఘం నాయకులు శివ, రమేశ్, విజయ్, నవీన్, రమేశ్, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మనోహరాబాద్ జడ్పీచైర్ పర్సన్ క్యాంపు కార్యాలయంలో
మనోహరాబాద్, సెప్టెంబర్ 26 : మనోహరాబాద్ జడ్పీ చైర్ పర్సన్ క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలత పూలమాల వేసి నివాళలర్పించారు. శివ్వంపేటలోఎంపీపీ కార్యాలయ ంలో ఎంపీపీ హరికృష్ణ, ఎంపీడీవో నవీన్‌కుమార్, మ నో హరాబాద్లో ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ లతావెంకట్గౌడ్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, పురం మహేశ్, నాయకులు శ్రీనివాస్, ఆంజనేయులు, వెంకటేశ్ పాల్గొన్నారు
పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో
పెద్దశంకరంపేట ,సెప్టెంబర్ 26 :పెద్దశంకరంపేటలో చాకలి ఐలమ్మ జయంతి మండల పరిషత్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ వీణా సుభాశ్‌గౌడ్, ఉప సర్పంచ్ దశరథ్, రజకసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ, జిల్లాయూత్ అధికార ప్రతినిధి సాయి తదితరులున్నారు.
మెదక్ అర్బన్‌లో..
మెదక్ అర్బన్, సెప్టెంబర్ 26: మెదక్ మండల పరిధిలోని తిమ్మానగర్‌లో మెదక్ మండల రజక సంఘం అధ్యక్షుడు సిద్ద్ధిరాములు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు.కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సాయి లు, ప్రధాన కార్యదర్శి శేఖర్, గ్రామ సర్పంచ్ లక్ష్మి ఎంపీటీసీ సిద్ధ్దాగౌడ్, వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట అమరవీరుల స్తూపం వద్ద
చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 26: చాకలి ఐలమ్మ జయంతి చిన్నశంకరంపేటలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రం, మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు హేమచంద్రం, టీఆర్ఎస్ నాయకులు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు
టేక్మాల్‌లో..
టేక్మాల్, సెప్టెంబర్ 26: తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమేశ్, నాయకులు సాయిలు, గంగారం, నర్సింహులు, రవి, సతీష్ ఉన్నారు.
హవేళీఘనపూర్‌లో..
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 26: హవేళీఘనపూర్‌లో మం డల కో- ఆప్షన్ సభ్యులు ఖాలేద్ ఆధ్వర్యంలో చాకలి ఐల మ్మ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి టీఆర్ఎస్ నాయ కులు, తదితరులు ఉన్నారు.
పాపన్నపేటలో..
పాపన్నపేట,సెప్టెంబర్26: మండల కేంద్రంతో పాటు మిన్పూర్, కుర్తివాడ గ్రామాల్లో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో పాపన్నపేట సర్పంచ్ గు రుమూర్తిగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు రాములు, ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, పాపన్నపేట ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు గౌస్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుభేరుడు, కాంగ్రెస్ నాయకులు శ్రీకాం త్ అప్పతో పాటు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.