e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home మెదక్ బృహత్‌ ప్రకృతి వనం రాష్ర్టానికే ఆదర్శంగా ఉండాలి

బృహత్‌ ప్రకృతి వనం రాష్ర్టానికే ఆదర్శంగా ఉండాలి

బృహత్‌ ప్రకృతి వనం రాష్ర్టానికే ఆదర్శంగా ఉండాలి

మర్కూక్‌, జూలై 20: మం డల కేంద్రంలో ఏర్పాటు కాను న్న బృహత్‌ ప్రకృతి వనం రాష్ర్టానికే ఆదర్శంగా ఉండాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం రైతువేదిక వద్ద ఏర్పాటు చేయనున్న బృహత్‌ ప్రకృతి వనం స్థలాన్ని గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ అన్నపూర్ణశ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, జడ్పీటీసీ మం గమ్మరాంచంద్రం, వైస్‌ ఎం పీపీ బాల్‌రెడ్డి, ఎంటీటీసీ చైతన్యశంకర్‌రెడ్డి, అడిషనల్‌ డీఆర్డీవో కౌసల్యాదేవి, తహసీల్దార్‌ ఆరీఫా, సర్పంచ్‌ అచ్చంగారి భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామా న పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పల్లెల తరహాలోనే మండల కేంద్రాల్లో బృహత్‌ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. ప్రతి మండల కేంద్రంలో బృహత్‌ ప్రకృతి వనాన్ని చేస్తున్నామన్నారు. ఎకరంలో చిల్డ్రన్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. పండ్ల మొక్కలు, దీర్ఘకాలికంగా ఉపయోగపడే శాండిల్స్‌, రెడ్‌ శాండిల్స్‌ నాటాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఆరేండ్లలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి 6 శాతం పచ్చదనం పెంచి, రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపాడన్నారు. కోట్లాది మొక్కలు నాటి గ్రామగ్రామాన పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ దళిత బంధువు అని అన్నారు. దళితబంధు ద్వారా రూ.10లక్షల యూనిట్లను అం దించి దళితుల అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు బాబుయాదవ్‌, సంతోష్‌రెడ్డి, ఎంపీడీవో ఓబులేశ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బృహత్‌ ప్రకృతి వనం రాష్ర్టానికే ఆదర్శంగా ఉండాలి
బృహత్‌ ప్రకృతి వనం రాష్ర్టానికే ఆదర్శంగా ఉండాలి
బృహత్‌ ప్రకృతి వనం రాష్ర్టానికే ఆదర్శంగా ఉండాలి

ట్రెండింగ్‌

Advertisement