e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home మెదక్ కొనుగోలు కేంద్రాలు, లారీల సంఖ్య పెంచాలి

కొనుగోలు కేంద్రాలు, లారీల సంఖ్య పెంచాలి

కొనుగోలు కేంద్రాలు, లారీల సంఖ్య పెంచాలి
  • ప్రతిపాదనలు సిద్ధం చేయండి
  • ధాన్యం తడవకుండా 10వేల టార్పాలిన్లు
  • టెలీకాన్ఫరెన్స్‌లో మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌

మెదక్‌, మే 17 : ధాన్యం తరలింపు ఇబ్బందులను దృ ష్టిలో ఉంచుకొని వచ్చే వాన కాలంలో ట్రాన్స్‌పోర్టు కాం ట్రాక్టర్ల సంఖ్యను 2 నుంచి 10కి, 350 కేంద్రాలకు ఉన్న 460 లారీల సంఖ్యను పెం చేలా ముందస్తుగా ప్రతిపాదనలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు పంపాలని మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి సూచించారు. ఒక్కో రైస్‌ మిల్లు రోజు 25 లారీల ధాన్యాన్ని దించుకోవచ్చని తెలి పారు. ధాన్యం కొనుగోళ్లపై సోమవారం పౌర సరఫరాల అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే పది రోజలు చాలా క్లిష్టమైనవని, అధికారులు శ్రద్ధ వహించి ప్రతి కేంద్రాన్ని సందర్శించి మానిటరింగ్‌ చేయాలని, ప్రతి మిల్లు యజమాని హమాలీలను ఎక్కువ సంఖ్యలో పెట్టుకొని రోజు కనీసం 25 లారీల ధాన్యం దించుకునేలా చర్యలు తీసుకోవాల న్నారు.

రైస్‌మిల్లులు నేటి వరకు ఎంత ధాన్యం దించుకోవాలి..? ఎంత దించుకున్నారు..? కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చింది..? ఎంత రావచ్చు..? లారీలు రాని కేం ద్రాలు ఎన్ని..? ఎన్ని రోజుల నుంచి లారీలు మిల్లుల వద్ద ఉన్నాయి..? వంటి వివరాలు వెంటనే అందించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా 10వేల టార్పాలిన్లు కేంద్రాలకు అందజేస్తున్నామని, ధాన్యం భద్రపర్చడానికి జిల్లాలో ఉన్న 76 రైతు వేదికలను ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రమేశ్‌, జిల్లా రైస్‌ మిల్లుల సంఘం అధ్యక్షుడు చంద్రపాల్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌, ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్‌, మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దా ర్లు, పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొనుగోలు కేంద్రాలు, లారీల సంఖ్య పెంచాలి

ట్రెండింగ్‌

Advertisement