e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home మెదక్ రైతులు ప్రభుత్వానికే ధాన్యాన్ని అమ్మాలి

రైతులు ప్రభుత్వానికే ధాన్యాన్ని అమ్మాలి

రైతులు ప్రభుత్వానికే ధాన్యాన్ని అమ్మాలి


దళారులకు అమ్మి నష్టపోవద్దు
రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సనీతారెడ్డి
ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి
మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల కేంద్రాలు ప్రారంభం

నర్సాపూర్‌, ఏప్రిల్‌ 14: రైతుల అభ్యున్నతికి ప్రభు త్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నర్సాపూర్‌లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషనర్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించి న ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని వారు గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల కోసం నిర్ణయించిన ధర లాభసాటిగా ఉందని తెలిపారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టి తీసుకువచ్చి మంచి ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ రమేశ్‌, ఆర్‌డీవో రవీందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, తహసీల్దార్‌ మాలతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మాచనూరి రాజుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయీమొద్దీన్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ హబీబ్‌ఖాన్‌, ఏఎంసీ డైరెక్టర్లు సూరారం నర్సింహులు, సాగర్‌, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

సంక్షోభంలోనూ సంక్షేమం

అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రజా సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే మం డలంలోని నార్లపూర్‌లో గ్రామపంచాయతీ కార్యాల యం ఏర్పాటుకు శంకుస్థాపన, సీసీ కెమెరాలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, నిజాంపేటలో సబ్‌ మార్కెట్‌ యార్డులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిందన్నారు. దళారుల చేతిలో మోసపోవద్దనే లక్ష్యంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొండపోచమ్మ సాగర్‌ ద్వారా గోదారి జలాలు హల్దీవాగుకు వస్తున్నాయని దీంతో మెదక్‌ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. త్వరలోనే కాళేశ్వ రం ప్రాజెక్ట్‌ ద్వారా నిజాంపేట మండలానికి 19వేల ఎకరాలకు సాగునీరు అందించబడుతుందని, కాల్వల నిర్మాణానికి భూములు అందించిన రైతుల త్యాగం మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలన్నారు. కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డల కన్నా తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తుందని, మండలానికి చెందిన 20మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. నార్లపూర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన రేణుకారావును ఎమ్మెల్యే సన్మానించారు.

రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షే మం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. అనంతరం సర్పంచ్‌ రేణుక గ్రామంలో సీసీ రోడ్లు, ఎస్టీ కమ్యూనిటీహాల్‌ మంజూరు కావాలని కోర గా అందుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వెంటనే సీసీ రోడ్లతోపాటు హాల్‌ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, మెదక్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాణిక్యరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం, జడ్పీటీసీ సుజాత ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతులు ప్రభుత్వానికే ధాన్యాన్ని అమ్మాలి

ట్రెండింగ్‌

Advertisement