e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home మెదక్ ‘దళిత సాధికారత పథకం’తో దళితుల జీవితాల్లో వెలుగు

‘దళిత సాధికారత పథకం’తో దళితుల జీవితాల్లో వెలుగు

‘దళిత సాధికారత పథకం’తో దళితుల జీవితాల్లో వెలుగు


మెదక్‌ మున్సిపాలిటీ, జూలై 13 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ సూచించారు. జడ్పీ కార్యాలయంలో మంగళవారం 6వ స్థాయీ సంఘం సమావేశం (సాంఘిక సంక్షేమం) రామాయంపేట జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమం, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి, వెనుకబడిన తరగతులు సంక్షేమం, అల్పా సంఖ్యాకవర్గాల సంక్షేమంపై ఆయా శాఖాల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, ఈ పథకాల అమలులో అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం రుణాలు అందజేస్తున్న బ్యాంకు అధికారులు కఠిన నిబంధనలు పెట్టడంతో చాలా మందికి రుణాలు అందకుండా పోతున్నాయన్నారు. రూ.లక్ష లోపు రుణాలకు ఎలాంటి నిబంధనలు పెట్టకుండా బ్యాంకర్లు ఇవ్వాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. సీఎం కేసీఆర్‌ గొప్ప ఆలోచనతో రూ.1200 కోట్లతో ‘దళిత సాధికారత పథకం’ ప్రకటించారన్నారు. బ్యాంకులకు సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే రుణా లు అందేలా ఈ పథకం లక్ష్యమన్నారు. నిరుపేద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలన్నదే సీఎం నిర్ణయమన్నారు. మొద టి విడుతగా నియోజకనర్గానికి 100 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ‘దళిత సాధికారత పథకం’ ఆదర్శంగా నిలిచి దళితులు జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు.

రైతు బీమా చెల్లింపులో జాప్యం తగదు..

  • మెదక్‌ జడ్పీ వైస్‌ చైర్సన్‌ లావణ్యరెడ్డి
    రైతు బీమా చెల్లింపులో జాప్యం చేయకుండా సకాలంలో ఆర్థిక సహాయం అందించాలని మెదక్‌ జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి వ్యవసాయధికారులకు సూచించారు. జడ్పీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు 3వ స్థాయీ సంఘం సమావేశం(వ్యవసాయం) వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, పశుపోషణ, పాడి పరిశ్రమాభివృద్ధి, అటవీశాఖ, మత్స్యశాఖ, పౌర సరఫరాలు, మార్కెటింగ్‌ తదితర శాఖలవారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా లావణ్యరెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం రైతుల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబీమా పథకం తీసుకొచ్చిందన్నారు. వెదజల్లే సాగు పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయధికారి పరశురామ్‌నాయక్‌కు సూచించారు. జిల్లాలో 1,33,556 మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించామని, ఈ ఏడాది 661 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారని, వారికి రైతు బీమా సొమ్ము అందజేశామని వివరించారు. జిలాల్లో రైతులకు ఇబ్బందులు కాకుండా కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచామని చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈవో శైలేశ్‌, జడ్పీ సూపరింటెండెంట్‌ మాణ య్య, జడ్పీటీసీలు యాదగిరి, సరోజ, కవిత, షర్మిల, కో-ఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌ అహ్మద్‌, డీఎఫ్‌వో జ్ఞానేశ్వర్‌, ఉద్యాన శాఖ అధికారి నర్సయ్యమత్యశాఖ ఏడీ మల్లేశం, భూగర్భ జల శాఖ అధికారి మాధవరావు, బీసీ వెల్ఫేర్‌ అధికారి జగదీశ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దేవయ్య, ఎస్సీ వెల్ఫేర్‌ అధికారిణి విజయలక్ష్మి, గిరిజన సంక్షేమాధికారి ఫిరంగి, మార్కెటింగ్‌ శాఖ అధికారి రియాజ్‌తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘దళిత సాధికారత పథకం’తో దళితుల జీవితాల్లో వెలుగు
‘దళిత సాధికారత పథకం’తో దళితుల జీవితాల్లో వెలుగు
‘దళిత సాధికారత పథకం’తో దళితుల జీవితాల్లో వెలుగు

ట్రెండింగ్‌

Advertisement