e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home మెదక్ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
  • ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి
  • తూప్రాన్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత
  • ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
  • ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి

తూప్రాన్‌ రూరల్‌, మే 12 : నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ వరంలాంటిదని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నా రు. తూప్రాన్‌ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందారు. వీరికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను బుధవారం మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌తో ప్రతాప్‌రెడ్డి అందజేశారు. ఆయన వెంట ఎంపీపీ గడ్డిస్వప్న, ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు కుమ్మరి నర్సింహులు, సత్తార్‌ ఉన్నారు. అనంతరం తూప్రాన్‌ తహ సీల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌తో కలిసి ముస్లింలకు రంజాన్‌ కానుకలు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్‌, కుమ్మరి రఘుపతి, నాయకులు కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అజార్‌, సమీర్‌, ముజీబ్‌ పాల్గొన్నారు. తూ ప్రాన్‌లోని 1వ వార్డులోని ముస్లింలకు రంజాన్‌ కానుకలను మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌ అందజేశారు.

టీఆర్‌ఎస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి
టీఆర్‌ఎస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాళ్లకల్‌లో ఎంపీపీ నవనీతా రవిముదిరాజ్‌ తో కలిసి ముస్లింలకు రంజాన్‌ కానుకలను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పురం మహేశ్‌, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ లావణ్య, వార్డు సభ్యుడు రాజుయాదవ్‌ ఉన్నారు.

పేదలకు ‘సీఎంఆర్‌ఎఫ్‌’ వరం
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం మెదక్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్‌ వరమని అన్నారు. మెదక్‌ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి నుంచి మొత్తం 181 మంది లబ్ధిదారులకు రూ.53,55,500 మంజూరయ్యాయని తెలిపారు. మెదక్‌లోని న్యూ మార్కెట్‌ వీధికి చెందిన నగరం కాళిదాసుకు రూ.60వేలు, ఫత్తేనగర్‌కు చెందిన ధర్మకార్‌ గంగారం రూ.34 వేలు, ధర్మకార్‌ రేణుక రూ.14వేలు, జమ్మికుంటకు చెందిన కొండాపురం రవి రూ. 16 వేలు, కత్తూరి భూదేవి రూ.11,500తోపాటు ఇతర లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమం లో మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, కౌన్సిలర్లు జయరాజ్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, నాయకులు లింగారెడ్డి, హవేళిఘనపూర్‌ వెంకట్‌రెడ్డి, మేడిశెట్టి సుమన్‌, ముజీబ్‌ పాల్గొన్నారు.

పనుల్లో నాణ్యత పాటించాలి : ఇఫ్కో డైరెక్టర్‌
పనుల్లో నాణ్యత పాటించాలని ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మల్లె చెర్వు పక్కన నిర్మిస్తున్న వైకుంఠధామ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని హంగులతో నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. వైకుంఠధామంలో నీటి వసతి క ల్పించి, నల్లాలు, బాత్‌రూంలు నిర్మించి, ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా పనులను పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, కౌన్సిలర్లు గజ వాడ నాగరాజు, చిలుక గంగాధర్‌, యాదగిరి, నాయకులు చింతల యాదగిరి, మల్యాల కిషన్‌ తదితరులున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ట్రెండింగ్‌

Advertisement