e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home మెదక్ జడివాన

జడివాన

జడివాన
  • ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు
  • సంగారెడ్డి జిల్లాలో సరాసరి 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
  • అత్యధికంగా సిర్గాపూర్‌లో 27.0 మిల్లీమీటర్లు
  • సాగుకు రైతన్నల సన్నద్ధం
  • నిండిన చెరువులు, కుంటలు, డ్యాంలు

మెదక్‌, జూలై 11 : మెదక్‌ జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి రేగోడ్‌, పెద్దశంకరంపేట, టేక్మాల్‌, పాపన్నపేట మండలాల్లో వర్షం కురువగా, కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్‌, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మనోహరాబాద్‌, తూప్రాన్‌, చిన్నశంకరంపేట, నిజాంపేట, నార్సింగి, రామాయంపేట, చేగుంట మండలాల్లో వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మెదక్‌ జిల్లాలో 4.8 మిల్లీమీటర్లు
మెదక్‌ వ్యాప్తంగా 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేగోడ్‌ మండలంలో అత్యధికంగా 21.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా వెల్దుర్తి మండలంలో 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హవేళీఘణాపూర్‌ మండలంలో 19.2 మిల్లీమీటర్లు నమోదు కాగా, పాపన్నపేటలో 17.9 మిల్లీమీటర్ల నమోదైంది. టేక్మాల్‌ మండలంలో 10.8 మిల్లీమీటర్ల నమోదు కాగా, మెదక్‌లో 6.6 మిల్లీమీటర్ల నమోదైంది. పెద్దశంకరంపేటలో 7.7మిల్లీమీటర్ల నమోదు కాగా, రామాయంపేటలో 4.8 మిల్లీమీటర్ల నమోదైంది. కొల్చారంలో 3.3 మిల్లీమీటర్లు, మనోహరాబాద్‌లో 4.8 మిల్లీమీటర్లు, నార్సింగిలో 1.3 మిల్లీమీటర్లు నమోదైంది. అల్లాదుర్గంలో 1.8 మిల్లీమీటర్ల నమోదైంది.

- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి, జూలై 11: సంగారెడ్డి జిల్లాలో ఆదివారం సరాసరి 2.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్గాపూర్‌ మండలంలో 27.0 మిల్లీమీటర్లు పడింది. జహీరాబాద్‌ మండలంలో వాగులు, వంకలు వరదలు పారుతున్నాయి.

సిద్దిపేట జిల్లాలో సరాసరి 13.6 మిల్లీమీటర్లు నమోదు
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 13.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్‌లో 70.3 మిల్లీమీటర్లు నమోదైంది. సిద్దిపేట రూరల్‌ మండలంలో 0.5 మి.మీ, చిన్నకోడూరులో 3.9 మి.మీ, బెజ్జంకిలో 3.1 మి.మీ, కోహెడలో 18.0 మి.మీ, అక్కన్నపేటలో 1.2 మి.మీ, నంగునూరులో 31.3 మి.మీ, సిద్దిపేట అర్బన్‌లో 1.5 మి.మీ, దౌల్తాబాద్‌లో 0.6 మి.మీ, రాయిపోల్‌లో 0.3 మి.మీ, వర్గల్‌లో 30.9 మి.మీ, ములుగులో 20.4 మి.మీ, మర్కూల్‌లో 36.3 మి.మీ, జగదేవ్‌పూర్‌లో 0.8 మి.మీ, గజ్వేల్‌లో 4.3 మి.మీ, కొండపాకలో 52.2 మి.మీ, కొమురవెల్లిలో 17.0 మి.మీ, చేర్యాలలో 5.2 మి.మీ, నారాయణరావుపేటలో 1.3 మి.మీ, ధూళిమిట్టలో 27.0 మి.మీ వర్షపాతం నమోదైంది.

అలుగుపారిన నల్లవాగు
నల్లవాగు ప్రాజెక్టు అలుగు పడడంతో ప్రాజెక్టు కింది ఆయకట్టు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏండ్ల తర్వాత అలుగు పారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలుగుపై నుంచి మూడు అంగుళాల నీరు కింది భాగానికి వెళ్తున్నాయి.

’సింగూరు’కు పెరుగుతున్న వరద ఉధృతి
రెండు రోజులుగా ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సాయిగావ్‌లో వర్షాలు కురుస్తుండడంతో సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. రెండు మూడు రోజుల్లో ప్రాజెక్టులోకి రెండు టీఎంసీల నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని ప్రాజెక్టు ఏఈ మజార్‌ మహమ్మద్‌ తెలిపారు. రైతులు, మత్స్యకారులు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 17.585 టీఎంసీల నీటిమట్టం ఉందని తెలిపారు. నీటి ఎత్తు 520.808 మీటర్లు ఉండగా, ఇన్‌ఫ్లో 3453 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 386 క్యూసెక్కులు వెళ్తుందని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జడివాన
జడివాన
జడివాన

ట్రెండింగ్‌

Advertisement