e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home మెదక్ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

మెదక్‌ రూరల్‌ జూన్‌ 10: ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఎంపీడీవో శ్రీరాములు అన్నారు. గురువారం మెదక్‌ మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో మెదక్‌ మండలానికి చెందిన లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 115మంది ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోగా 76మంది హాజరయ్యారు. ఏపీజీవీబీ మంబోజిపల్లి ,ఎస్‌బీఐ (ఏడీబీ) ఎస్‌బీఐ (జెయన్‌ రోడ్‌ మెదక్‌ పట్టణం ) బ్యాంకులు లబ్ధిదారులకు ఇంటర్వ్యూ లు నిర్వహించి అధికారులు పత్రాలను పరిశీలించారు. అర్హుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యమున జయరాంరెడ్డి, ఏపీఎం ఇందిరా, పంచాయతీకార్యదర్శిలు లక్ష్మణ్‌, మల్లేశం, శ్రీధర్‌ ,ప్రవీణ్‌, జూనియర్‌ ఆసిస్టెంట్‌ మారుతి, సాయి , బ్యాంకు అధికారులు పాల్లొన్నారు.

మెదక్‌ మున్సిపాలిటీలో…
మెదక్‌ మున్సిపాలిటీ, జూన్‌ 10: సబ్సిడీ రుణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న మెదక్‌ పట్టణానికి చెందిన షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వారికి ఈనెల 14న బ్యాంకు అధికారులతో ఇంటర్వ్యూలు ఉంటాయని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 11 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలతో మున్సిపల్‌ కార్యాలయంలో హాజరు కావాలన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం ఇంటర్వ్యూలు
పెద్దశంకరంపేట, జూన్‌10: పెద్దశంకరంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎంపీడీవో రామ్‌నారాయణ, ఎంపీవో రియాజొద్దీన్‌ ఇంటర్వూలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్‌ కింద మండలంలో 14 యూనిట్లు ఉండ గా 185 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయా బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

రామాయంపేట …
రామాయంపేట, జూన్‌ 10: ఎస్సీ కార్పొరేషన్‌ రాయితీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఏపీజీవీబీ, ఎస్‌బీహెచ్‌, ఆంధ్రాబ్యాంకు మేనేజర్లు మహేశ్‌గౌడ్‌, మహేందర్‌ అన్నారు. రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని లక్ష్మాపూర్‌ ఏపీజీవీబీ బ్యాంకుల ఇంటర్వ్యులను ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. లబ్ధిదారుల పత్రాలను సంబంధిత ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయానికి పంపిస్తామన్నారు. మండలవ్యాప్తంగా ఇంటర్వ్యులకు మొత్తం 114 మంది లబ్ధిదారులు హాజరైన్నారు. కార్యక్రమంలో బ్యాంకుల మేనేజర్లతో పాటు ఫీల్డ్‌ ఆఫీసర్లు, ఎంపీవో గిరిజారాణి, సాయి, గాంధీ తదితరులున్నారు.

కొల్చారం …
కొల్చారం, జూన్‌ 10 : కొల్చారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు గురువారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు 61 మంది హాజరైనట్లు ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రంగంపేట స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా పరిధిలోని గ్రామాలైన సంగాయిపేట, రంగంపేట, తుక్కాపూర్‌, కోనాపూర్‌, పైతర, ఏటిగడ్డమాందాపూర్‌, ఎనగండ్లకు చెందిన 98 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూలకు 61 మంది హాజరయ్యారు.

నిజాంపేట …
నిజాంపేట,జూన్‌10: ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయలంలో ఎంపీపీ సిద్ధిరాములు,సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కల్వకుంట శాఖ మేనేజర్‌ సుధీర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ బాలకృష్ణ ఇంటర్వ్యూలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసుకున్న 40 మంది దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ నిర్వహించామన్నారు.కార్యక్రమంలో ఎంపీవో రాజేందర్‌, నందిగామ ఎంపీటీసీ సురేశ్‌,సూపరింటెండెంట్‌ కరీముల్లా,జూనియర్‌ అసిస్టెంట్‌ వినయ్‌కుమార్‌ ఉన్నారు.

నర్సాపూర్‌లో…
నర్సాపూర్‌,జూన్‌10:పట్టణంలోని ఎంపీడీవో కార్యాల యంలో మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కార్పొ రేషన్‌ లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని మెప్మా మేనేజర్‌ఇందిరా తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 42 మంది లబ్ధిదారులకు గాను 33 మంది ఇంటర్వ్యూకు హాజరైనట్లు తెలిపారు. 33 మందిలో 8 మంది ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికైన వారికి త్వరలోనే రుణాలను మంజూరు చేస్తామన్నారు.

రుణాలకోసం ఇంటర్వ్యూలు
చిన్నశంకరంపేట,జూన్‌10: ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్‌బీఐ గవ్వలపల్లి బ్రాంచ్‌ పరిధిలోని గ్రా మాలకు, ఆంధ్రాబ్యాంకు మడూర్‌ బ్రాంచ్‌ పరిధిలోని గ్రా మాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, ఎస్‌బీఐ గవ్వలపల్లి బ్రాంచ్‌ మేనేజర్‌ సురేశ్‌బాబు, ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌ హరీశ్‌, ఎంపీవో గిరిధర్‌రెడ్డి ఉన్నారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement