e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home మెదక్ సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌

సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌

సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌

మెదక్‌ మున్సిపాలిటీ, జూన్‌ 4: సూపర్‌ స్ప్రెడర్లకు విడుతల వారీగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపడుతామని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి శుక్రవారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం చిరు వ్యాపారులు, కిరాణం, మెడికల్‌, కూరగాయలు, మటన్‌, చికెన్‌, చేపలు, పండ్లు, హార్డ్‌వేర్‌ అమ్మకం దారులతో పాటు శ్మశాన వాటికల్లో పని చేసే వారికి సూచించిన తేదీన మెదక్‌ ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి కరోనా టీకా తీసుకోనాలని సూచించారు. ఈ సందర్భంగా వారి వద్దకు వెళ్లి వారి పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. వారు ఏ తేదీన టీకా తీసుకోవాలో మొబైల్‌కు మెసేజ్‌ వస్తుందని, ఆరోజున ఎంపీడీవో కార్యాలయాలనికి వెళ్లి టీకా తీసుకోవాలన్నారు. పట్టణంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, పట్టణ ప్రజలు కరోనాను కట్టడి చేసే వరకు నిబంధనలు పాటించాలన్నారు. గత నెల 29న సూపర్‌ స్ప్రెడర్లు రేషన్‌ డీలర్లు, విత్తన డీలర్లు, గ్యాస్‌ డెలివరీ సిబ్బందికి, జర్నలిస్టులతో పాటు పలువురికి టీకా ఇచ్చిన విషయం తెలిసిందే.

రామాయంపేటలో..
నేటి నుంచి రామాయంపేట పట్టణంలోని వ్యాపారస్తుల కోసం వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఏర్పా టు చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం మున్సి ప ల్‌ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు ఇచ్చారు. పట్టణంలోని నేటి నుం చి నిర్వహించే వ్యాక్సిన్‌ శిబిరానికి వ్యాపారస్తులు దుకాణం లో పనిచేసే కార్మికులు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పా టు చేసే శిబిరంలో తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారు ఒకరోజు ముందుగానే తమపేరు ను మున్సిపాలి టీ సిబ్బందితో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. పట్టణ వ్యాపారస్తులు మున్సిపల్‌ సిబ్బందికి సహకరించాలని చైర్మ న్‌ తెలిపారు. రామాయంపేటకు ప్రత్యేక వ్యాక్సిన్‌ శిబిరానికి కృషి చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి చైర్మన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌

ట్రెండింగ్‌

Advertisement