e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కురిసిన వర్షం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కురిసిన వర్షం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కురిసిన వర్షం

సంగారెడ్డి జిల్లాలో సరాసరి20.3 మీ.మీ వర్షపాతం
అత్యధికంగా గుమ్మడిదలలో 76.8 మిల్లీ మీటర్లు..
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వాన
తడిసిన ధాన్యం

సంగారెడ్డి, జూన్‌ 3 : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వరి ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి జిల్లాలో సరాసరి 20.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుమ్మడిదల మండలంలో 76.8మిల్లీ మీటర్లు పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మొగుడంపల్లిలో 49.3 మీ.మీ, రాయికోడ్‌లో 44.0 మీ. మీ, అందోల్‌లో 36.2మీ.మీ, పటాన్‌చెరులో 32.6 మీ.మీ, హత్నూరలో 30.2 మిల్లి మీటర్ల వర్షం కురిసిందని పేర్కొన్నారు. వర్షాలు పడడంతో అన్నదాతలు విత్తనాలు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
తడిసిపోయిన వరి ధాన్యం
రాయపోల్‌, మే 3: అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కొనుగోలు కేం ద్రాల్లో తీసుకువచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతులు ధైర్యంగా ఉండాలని జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి భరోసా కల్పించారు. గురువారం మండలంలోని రాయపోల్‌, చిన్నమాసాన్‌పల్లి గ్రామాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు.
మద్దూరులో ఓ మోస్తరు వర్షం..
మద్దూరు, మే 3 : మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. వర్షానికి మద్దూరులో కొనసాగుతున్న వారంతపు సంతకు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు తమ దుక్కులను దున్నుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కురిసిన వర్షం

ట్రెండింగ్‌

Advertisement