మెదక్ : అనుమానాస్పద స్థితిలో ఓ కారు దగ్ధమైంది. ఈ సంఘటన జిల్లాలోని వెల్దుర్తి మండల పరిధిలోని యశ్వంతరావు పేట గ్రామ శివారు వెల్దుర్తి – నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కన చోటు చేసుకుంది. హోండా సిటీ కారు దగ్ధమవగా కారులో పూర్తిగా కాలిపోయిన పురుషుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని వెల్దుర్తి ఎస్సై మహేందర్, కౌడిపల్లి ఎస్ఐ రాజశేఖర్ పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.