నిజాంపేట,అక్టోబర్8 : బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని నార్లపూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 11 ఏండ్ల ఓ బాలికను అదే గ్రామానికి చెందిన వ్యక్తి మన్నె నర్సింహులు (65) పలుమార్లు లైంగిక దాడికి పాల్పాడ్డాడు.
దీంతో బాలికక తీవ్ర అస్వస్థకు గురికావడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను దవాఖానలో చికిత్స నిర్వహించారు.
బాలిక 5 నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిజాంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.