బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులకు చాలా సుపరిచితం హరితేజ. బిగ్ బాస్ కార్యక్రమం తొలి సీజన్లో పాల్గొన్న ఈ అమ్మడు తెగ సందడి చేసింది. 2015లో దీపక్ రావును పెళ్లాడిన హరితేజ ఈ ఏడాది ఏప్రిల్ 5న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. గర్భంతో ఉన్నప్పటి నుండి తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన హరితేజ ఇటీవల తన కూతురి పేరు భూమిక దీపకరావ్ అని పెట్టామని తెలియజేసింది. అంతేకాదు ఆ పేరుకు వివరణ కూడా ఇచ్చారు. భూమి అంటే సహనంతో ఉంటుందని అనుకుంటున్నారు.. కానీ వాళ్లకేం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అని తన బిడ్డ చెబుతున్నట్టుగా హరితేజ తన పోస్ట్‌లో పేర్కొంది.
ఇక హరితేజ తన కూతురిని ఎప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తొలిసారి భూమిక పిక్ షేర్ చేసి నెటిజన్స్‌కి ఆనందాన్ని అందించింది. మీట్ మిస్ భూమి దీపక్ రావ్ అంటూ కూతురి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకోగా, ఈ ఫొటోలపై పలువురు బుల్లితెర ప్రముఖులు సహా నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అచ్చం తల్లి మాదిరిగానే ఉందని క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.