పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి

- ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలి
- మహిళలపై జరుగుతున్న నేరాలపై కేసు నమోదు చేయాలి
- 42 మంది సిబ్బందికి సైబర్ క్రైంపై శిక్షణ
- డీజీపీ మహేందర్‌రెడ్డి
- హైదరాబాద్ నుంచి ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష
- పాల్గొన్న ఎస్పీ చందనదీప్తి, ఉన్నతాధికారులు
మెదక్, ఫిబ్రవరి 22: జిల్లాలో పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో ఇప్పటి వరకు పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల్లో జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగ్గించేలా కృషి చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసుల్లో గ్రేవ్, నాను గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి ప్రతీరోజు కేసులను టార్గెట్‌గా పెట్టుకొని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో(యు.ఐ) కేసులు తగ్గించడానికి, అట్టి టార్గెట్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రతి అధికారి కేసులు ఛేధించాలని సూచించారు. అదేవిధంగా మహిళలు, పిల్లల రక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీసు అధికారులు మహిళా రక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తుకు వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై సత్వరమే స్పందించి వెంటనే కేసు నమోదు చేసి ఎలాంటి జాప్యం లేకుండా నిందితులను అరెస్ట్ చేయాలని తెలిపారు. అలాగే, ఫోక్సో కేసుల్లో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తును చేసి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా చూడాలని, చట్టంపై సమాజంలో అవగాహన కల్పించాలని, ప్రతి యూనిట్ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రత్యేక ప్రణాళికతో పెండింగ్ కేసులను తగ్గించాలని అధికారులకు సూచించారు. సమీక్షలో జిల్లా ఎస్పీ చందనదీప్తి, మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్, డీసీఆర్బీ సీఐ వెంకటేశ్, జిల్లా సీసీఎస్ సీఐ మురళీ పాల్గొన్నారు.
జిల్లాలో సైబర్ క్రైం యూనిట్ ఏర్పాటు
పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్లుగా దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైం యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో సైబర్ క్రైం యూనిట్ ఏర్పాటు ద్వారా స్థానికంగానే కేసులను పర్యవేక్షించేందుకు సాంకేతిక శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని సోమవారం డీజీపీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో మాట్లాడుతూ సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ వారియర్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో జరిగే నేరాలను అక్కడికక్కడే నియంత్రించేందుకు ఈ విభాగాలు కృషి చేస్తాయని అన్నారు. సైబర్ కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి నేరస్తులను గుర్తించడం, నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడం, బాధితులకు న్యాయం చేయడం అనేది చాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బందికి రోజుకు మూడు గంటల పాటు వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించి ఆన్లైన్లో శిక్షణ అందిస్తున్నట్టు పేర్కొన్నారు. సైబర్ నేరం ఎలా జరుగుతుందనే దగ్గరి నుంచి దాన్ని సృష్టిస్తున్న వారి వరకు అందరినీ గుర్తించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. పోలీసు శాఖలో నియమితులై పూర్తి స్థాయిలో టెక్నాలజీపై పట్టున్న సిబ్బందిని సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగించి ప్రజలకు త్వరితగతిన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శిక్షణ భాగంగా కంప్యూటర్ వైరస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ చాలెంజెస్, రిస్క్ అండ్ మేనేజ్మెంట్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ యాక్ట్, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇంటర్నెట్ డాటా సెంటర్, నెట్ వర్కింగ్ వ్యవస్థ, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ ఆడిటింగ్ కైంప్లెన్స్, ఐవోటీ, క్లిష్టమైన వెబ్ అప్లికేషన్స్, సెక్యూరిటీ రిస్క్స్, మొబైల్ అప్లికేషన్స్, సెక్యూరిటీ, సోషల్ మీడియా ఇన్ ఈ గవర్నెన్స్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ తదితరాలపై వారం పాటు సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. మెదక్ జిల్లా పరిధిలో 42 మంది సిబ్బందిని సైబర్ క్రైమ్‌పై శిక్షణ పొందేందుకు ఎంపికచేసినట్లు జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు.
తాజావార్తలు
- ఆయన వస్తే మార్పులేం ఉండవు.. వైస్సార్సీపీలోకి గంటా రాకపై విజయ్ సాయి
- నా పేరే..సారంగ దరియా!
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఫోటోలు ఇలా డిలిట్
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- భారత్‌పై సైబర్ దాడుల వార్తలు నిరాధారం:చైనా
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- పెట్రోల్ ధరల సెగ.. విద్యుత్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్